బ్రేకింగ్.. చిదంబరం అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

బ్రేకింగ్.. చిదంబరం అరెస్ట్

August 21, 2019

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరాన్ని ఆయన ఇంటి వద్ద సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. గత 24 గంటలుగా అజ్ఞాతంలో ఉన్న చిదంబరం కొద్ది సేపటి క్రితమే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలను కలిశారు. 

తరువాత మీడియాలో మాట్లాడిన ఆయన ఐఎన్‌ఎక్స్ మీడియా కేసుకు తనకు ఎలాంటి సబంధం లేదని చెప్పారు. తాను ఎలాంటి నేరం చేయలేదని.. ఈ కేసులో కావాలనే కొందరు తనను ఇరికించారని వెల్లడించారు. చిదంబరం ఏఐసీసీ కార్యాలయంలో ఉన్నారని సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు అక్కడికి చేరుకునేలోపే ఆయన ఇంటికి వెళ్లిపోయారు. దీంతో సీబీఐ అధికారులు నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు చిదంబరాన్ని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.