తండ్రికి కరోనా.. కొడుకు స్వీయ నిర్బంధంలోకి - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రికి కరోనా.. కొడుకు స్వీయ నిర్బంధంలోకి

May 29, 2020

IOA Chief.

ఊళ్లో ఒకరికి కరోనా సోకితేనే ఊరంతా హడలెత్తిపోతున్నారు. అలాంటిది ఒకే ఇంట్లో తండ్రికి కరోనా వస్తే కొడుకు ఎంత హైరానా చెందుతాడో ఊహించండి. తమ వాళ్లకు ఏం కాకూడదనే అదుర్దా, తనకూ ఏం కావొద్దనే భయం రెండూ ఇప్పుడు మనుషులను వేధిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితే  భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) చీఫ్ నరీందర్ బాత్రాకు ఎదురైంది. తన తండ్రికి కరోనా సోకడంతో తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. బాత్రా తండ్రి, ఇద్దరు అటెండెంట్లకు ఇటీవలే కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాత్రా తెలిపారు.

ఇదిలావుండగా కొందరు సెక్యూరిటీ గార్డులకు కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఐఓఏ ఆఫీసుకు వచ్చిన మరో ఉద్యోగికి కూడా కరోనా సోకడంతోనే.. తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్తున్నట్లు బాత్రా స్పష్టంచేశారు. కాగా, ఇప్పటి వరకు దేశంలో 1,65,700 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.