iPhone Factory clashes in china
mictv telugu

ఐఫోన్ ఫ్యాక్టరీలో హింస.. తిరగబడ్డ కార్మికులు

November 23, 2022

iPhone Factory clashes in china

చైనాలోని ఐఫోన్ల ఫ్యాక్టరీలో అలజడి రేగుతోంది. జీతాలు చాలా తక్కువగా ఇస్తున్నారని, ఫ్యాక్టరీలో సరైన సదుపాయాలే లేవని కార్మికులు తిరగబడ్డాడు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. బుధవారం ఇరుపక్షాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.

అలాంటిదేమీ లేదని చైనా ప్రభుత్వం బుకాయిస్తున్నా వీడియోలు బయటికి రావడంతో అసలు పరిస్థితి ఏమిటో ప్రపంచానికి తెలిసిపోతోంది. రెండు లక్షలమంది పనిచేసే జెంగ్‌జౌ ఫ్యాక్టరీలో దుర్భర పరిస్థితిని తట్టుకోలేక కార్మికులు బయటికి పారిపోతున్న దృశ్యాలు ఇటీవల బయటికొచ్చాయి. తాజా పోలీసులతో గొడవ పడుతున్న వీడియోలు కూడా రావడంతో అక్కడ శ్రమదోపిడీ జరుగుతోందని అర్థమవుతుంది. కార్మికులు జీతాల పెంపు కోసం, మెరుగైన సదుపాయాల కోసం ఆందోళన చేస్తున్నట్లు కంపెనీ కూడా ఒప్పుకుంది. అయితే కోవిడ్ సోకిన ఉద్యోగులను తాము నిర్బంధించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. తైవాన్‌కు చెందిన జెంగ్‌జౌ ఫ్యాక్టరీ ఐఫోన్లను తయారు చేసే అతి పెద్ద కంపెనీ. కోవిడ్ అలజడితో, కార్మికుల బయటికి వెళ్లనీయకుండా అడ్డుకుంటోందని ఆరోపణలు ఉన్నాయి.