భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు - MicTv.in - Telugu News
mictv telugu

భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు

September 11, 2019

iPhone prices cut in India.

మంగళవారం యాపిల్ సంస్థ ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో జరిగిన యాపిల్ వార్షిక సదస్సులో ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రోమ్యాక్స్ ఫోన్లను ఆవిష్కరించారు. 

ఈ నేపథ్యంలో యాపిల్ పాత ఐఫోన్ల ధరలు భారత్‌లో గణనీయంగా తగ్గాయి. గతేడాది ఆవిష్కరణ సమయంలో ఐఫోన్ ఎక్స్ ఆర్ ధర రూ.76,900 కాగా ఇప్పుడు రూ.49,900కు తగ్గించారు. ఇక ఐఫోన్ ఎక్స్ ఎస్ ధర రూ.99,900 గా ఉండేది దానిని రూ.89,900కి కుదించారు. ఐఫోన్ ఎక్స్ ఆర్ 64జీబీ వేరియంట్ రూ.49,900.. 128 జీబీ ధర రూ.54,900గా మార్చారు. ఎక్స్ ఎస్ 256 జీబీ ధర 1,03,900కు తగ్గించారు. మొదట్లో దీని ధర రూ.1,14,900గా ఉండేది. ఐఫోన్ 8ప్లస్ 64 జీబీ రూ.49,900, ఐఫోన్ 8 64జీబీ మోడల్ ధర రూ.39,900కు తగ్గించారు. అలాగే మరీ పాత మోడళ్ళు అయిన ఐఫోన్ 7 32జీబీ, 128 జీబీ ధరలు వరుసగా రూ.29,900.. రూ.34,900కు తగ్గించారు. 7ప్లస్ ధరలు 37,900 (32జీబీ) రూ.42,900 (128 జీబీ)గా ఉన్నాయి. అయితే ఐఫోన్ ఎక్స్, ఎక్స్ ఎస్ మ్యాక్స్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఒక్కొక్క మోడల్ ఐఫోన్‌పై దాదాపు పది తగ్గడం పట్ల యాపిల్ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.