దూసుకొచ్చిన బాణం.. ప్రాణాలు కాపాడిన ఐఫోన్.. - MicTv.in - Telugu News
mictv telugu

దూసుకొచ్చిన బాణం.. ప్రాణాలు కాపాడిన ఐఫోన్..

March 14, 2019

ఫోన్ వాడితే ప్రాణలు పోతాయని పెద్దలు తరచూ తిడుతుంటారు. కానీ అదే ఫోన్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. అతడికి తగలబోతున్న బాణాన్ని అడ్డుకుని ప్రాణం పోకుండా కాపాడింది. ఈ ఘటన  ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో చోటు చేసుకుంది.

iPhone Saves a Man’s Life! Australian Survives Arrow Attack Thanks to his Apple Phone

నింబిన్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి ముందు నిల్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి అతనిపై బాణంతో దాడి చేయడానికి సిద్ధంకాగా.. అతని ఫొటో తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ బాణం నేరుగా బాధితుడి   ఐఫోన్ కు తగిలింది. ఒకవేళ ఆ ఫోన్ లేకపోయుంటే బాణం బాధితుడి తలలోకి చొచ్చుకెళ్లిపోయేది. బాణం వేగంగా దూసుకురావడంతో బాధితుడి గడ్డానికి స్వల్ప గాయమైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. బాణం మొబైల్ నుంచి చొచ్చుకెళ్లిన ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, కోర్టుకు తరలించారు.