Iphone Still Working 460 Days After Lost It In The Sea
mictv telugu

సముద్రంలో పోయిందనుకుంటే.. 460 రోజులకు దొరికింది!

November 24, 2022

ఏ ఫోన్ నీటిలో మునిగినా పని చేయదు. కానీ ఒక ఫోన్ సముద్రంలో మునిగి 460 రోజుల తర్వాత బయట పడింది. అప్పుడు కూడా బాగా పనిచేయడం ఇక్కడ విశేషం. క్లారే.. 2021లో ఐఫోన్8 ప్లస్ తీసుకుంది. 4 ఆగస్టు 2021లో సముద్ర ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లింది. ఆమెకు ప్యాడిల్ బోర్డింగ్ అంటే చాలా ఇష్టం. ఆ రోజు కూడా చేయాలనుకుంది. అలల మీద అలా వెళ్లి బయటకు వచ్చింది. తీరా తీరానికి వచ్చేసరికి ఫోన్ కనిపించలేదు. ఎంత వెతికినా కూడా దొరుకలేదు. అదే ఫోన్ దొరికిందని 7 నవంబర్ 2022న ఒకతను ఫోన్ చేశాడు. నీటిలో పోయిందనుకున్న ఫోన్ సుమారు 460 రోజులకు దొరికింది. అది కూడా పనిచేసే కండీషన్ లో ఉన్నది. అలా దొరికింది..

తీర ప్రాంతాల్లో వాకింగ్ చేయడం మామూలే. రోజులాగే ఒకతను ఇస్టానీ బీచ్ కి వచ్చాడు. కుక్కతో పాటు వాకింగ్ చేస్తున్న సమయంలో దూరంగా ఏదో కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే ఫోన్. దాంతో పాటు ఆ ఫోన్ పెట్టిన కేస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, క్లారే తల్లి మెడికల్ కార్డ్ ఉన్నాయి. ఈ మెడికల్ కార్డ్లోనే క్లారే వివరాలు, క్లారే తల్లి ఫోన్ నంబర్లున్నాయి. వెంటనే అతను ఆమెను కాంటాక్ట్ అయ్యాడు. అలా క్లారే చేతికి పోయిందనుకున్న ఫోన్ వచ్చింది. ‘ఇది చాలా క్రేజీగా ఉంది. ఆ ఫోన్ కోసం చాలా వెతికాను. నేను ప్యాడల్ బోర్డింగ్ చేసినప్పుడు ఫోన్ ఎప్పుడు నా మెడ చుట్టూ వేసుకుంటాను. ఆ రోజు కూడా అలాగే వేసుకున్నా. సముద్రంలో నుంచి బయటకు వచ్చాక చూసుకుంటే ఫోన్ మాయం. చాలాసేపు వెతికాను. కానీ దొరుకలేదని తిరిగి వచ్చేశాను’ అంటున్నది క్లారే.

‘సముద్రం ఎంతో ఉధృతంగా ఉంటుంది. ఆ అలల తాకిడికి పాడైపోయిందనుకున్నా. వెనుక భాగం కొంత డ్యామేజ్ అయింది. దానివల్ల నీళ్లు లోపలికి వెళ్లాయనుకున్నా. కానీ అదేమీ జరుగలేదు. ఈ ఫోన్ పోయిందనుకొని మరొక ఫోన్ తీసుకున్నాననుకోండి అది వేరే విషయం. కానీ పోయిందనుకున్న ఫోన్ దొరికినందుకు నేను చాలా హ్యాపీ’ అంటున్నది క్లారే. ఇలాంటిదే మరొక సంఘటన 2019లో జరిగింది. ఐ ఫోన్ 6 విమానంలో నుంచి ఒక ఐస్ల్యాండ్ లో పడిపోయింది. 13 నెలల తర్వాత అది దొరికింది. అప్పటికీ అది బాగా పని చేస్తున్నది.