అద్భుతమైన ఫీచర్స్ తో ఐఫోన్ 10...! - MicTv.in - Telugu News
mictv telugu

అద్భుతమైన ఫీచర్స్ తో ఐఫోన్ 10…!

September 13, 2017

ఎన్ని ఫోన్ల కంపిన్లు.. ఎన్ని  ఫీచర్స్ తో కొత్త ఫోన్లను మార్కెట్లకు విడుదల చేసినా, ఆపిల్ ఐఫోన్ కున్న ప్రత్యేకతనే వేరు.  కొందరు వాళ్ల  స్టేటస్ కి సింబల్  ఐఫోన్ వాడుతుంటారు. అయితే  యాపిల్ కంపెనీ తన పదేళ్ల వార్షికోత్సం సందర్బంగా  మరిన్ని ఫీచర్స్ తో ఐఫోన్ 10 ని మార్కెట్లకు తీసుకురాబోతుంది. దాని ఫీచర్లు చూస్తే దిమ్మ తిరగాల్సిందే. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది…

ఈ ఐ ఫోన్ మనిషి యొక్క ముఖ ఆకృతి గుర్తుపడుతుందట. ఫోన్ ను ముఖానికి  ఎదురుగా ఉంచుకొని ,కళ్లతో చూడడం ద్వారా  ఫోన్ అన్ లాక్ అవుతుందట. చార్జింగ్ ప్యాడ్ పైన ఫోన్‌ను ఉంచ‌డం ద్వారా చార్జింగ్ అవుతుంది.

అంటే వైర్ లెస్ ఛార్జింగ్ అన్నమాట. అయితే ఈ వైర్‌లెస్ చార్జింగ్‌ను ఇదివ‌ర‌కే సామ్‌సంగ్ లాంటి ఫోన్లలో ప్రవేశ‌పెట్టారు. ఐ ఫోన్ 10లో 12 మెగా పిక్సెల్‌ డ్యూయల్‌ కెమేరాలు ఉన్నాయి. పోర్ట్రేట్ లైటింగ్ అనే కొత్త బీటా ఫీచ‌ర్‌ను ప‌రిచ‌యం చేశారు.

https://twitter.com/VenyaGeskin1/status/903301069530378240

దీని వ‌ల్ల ఫోటో తీసే చుటుప‌క్కల ప‌రిస‌రాల లైటింగ్ ఎఫెక్ట్స్‌లో మార్పులు స్పష్టంగా క‌నిపిస్తాయి. దీంతో మ‌రింత నాణ్యమైన ఫొటోలు తీసేందుకు అవ‌కాశం ఉంది. 64 జీబీ నుంచి  ప్రారంభమయ్యే ఐఫోన్‌ టెన్‌ ధర999 డాలర్లుగా నిర్ణయించారు. 256 జీబీ  మోడ‌ల్ అయితే ఏకంగా 1149 డాల‌ర్లుగా నిర్ణయించారు. ఇదే అత్యంత కాస్ట్లీ ఐ ఫోన్‌. ముంద‌స్తు బుకింగ్‌లు అక్టోబ‌ర్ 27న ప్రారంభ‌మ‌వుతాయి. న‌వంబ‌ర్ 3న అమెరికాతో పాటు కొన్ని దేశాల్లో అందుబాటులోనికి వ‌స్తుంది. ఇండియాలోకి ఎప్పుడు వస్తుందో యాపిల్ కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

చార్జింగ్ ప్యాడ్ పైన ఫోన్‌ను ఉంచ‌డం ద్వారా చార్జింగ్ అవుతుంది. అంటే వైర్ లెస్ ఛార్జింగ్ అన్నమాట. అయితే ఈ వైర్‌లెస్ చార్జింగ్‌ను ఇదివ‌ర‌కే సామ్‌సంగ్ లాంటి ఫోన్లలో ప్రవేశ‌పెట్టారు. ఐ ఫోన్ 10లో 12 మెగా పిక్సెల్‌ డ్యూయల్‌ కెమేరాలు ఉన్నాయి. పోర్ట్రేట్ లైటింగ్ అనే కొత్త బీటా ఫీచ‌ర్‌ను ప‌రిచ‌యం చేశారు. దీని వ‌ల్ల ఫోటో తీసే చుటుప‌క్కల ప‌రిస‌రాల లైటింగ్ ఎఫెక్ట్స్‌లో మార్పులు స్పష్టంగా క‌నిపిస్తాయి. దీంతో మ‌రింత నాణ్యమైన ఫొటోలు తీసేందుకు అవ‌కాశం ఉంది. 64 జీబీ నుంచి  ప్రారంభమయ్యే ఐఫోన్‌ టెన్‌ ధర999 డాలర్లుగా నిర్ణయించారు. 256 జీబీ  మోడ‌ల్ అయితే ఏకంగా 1149 డాల‌ర్లుగా నిర్ణయించారు. ఇదే అత్యంత కాస్ట్లీ ఐ ఫోన్‌. ముంద‌స్తు బుకింగ్‌లు అక్టోబ‌ర్ 27న ప్రారంభ‌మ‌వుతాయి. న‌వంబ‌ర్ 3న అమెరికాతో పాటు కొన్ని దేశాల్లో అందుబాటులోనికి వ‌స్తుంది. ఇండియాలోకి ఎప్పుడు వస్తుందో యాపిల్ కంపెనీ ఇంకా ప్రకటించలేదు.