భారీగా తగ్గిన ఆపిల్ ఐఫోన్ల ధరలు.. - MicTv.in - Telugu News
mictv telugu

భారీగా తగ్గిన ఆపిల్ ఐఫోన్ల ధరలు..

October 14, 2020

iPhone XR, iPhone SE (2020), iPhone 11 Price in India Cut

ప్రపంచ ప్రఖ్యాత స్మార్ట్ ఫోన్ తయారీదారు ఆపిల్ మంగళవారం ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. దీంతో పాత ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. ధరలు తగ్గిన వాటిలో ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎస్ఈ(2020), ఐఫోన్ 11 మోడల్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ప్రస్తుతం తగ్గిన ధరలతోనే ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. 

ధర తగ్గించడంతో పాటు ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎస్ఈ(2020), ఐఫోన్ 11 బాక్సుల నుంచి చార్జర్ ఇయర్ పోడ్స్ హెడ్ ఫోన్స్‌ను తొలగించారు. ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే చార్జర్, ఇయర్ ఫోన్స్ లభించవు. తగ్గిన ధరల విషయానికి వస్తే.. ఐఫోన్ ఎక్స్ఆర్ ధర రూ.52,500 నుంచి రూ.47,900కు తగ్గింది. ఐఫోన్ ఎస్ఈ(2020) స్మార్ట్ ఫోన్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,500 నుంచి రూ.39,500కు తగ్గింది. ఐఫోన్ 11 ప్రారంభ వేరియంట్ 64 జీబీ ధర రూ.68,300 నుంచి రూ.54,900కు తగ్గింది.