సరికొత్త ఫీచర్స్‌తో ఐఫోన్13 - MicTv.in - Telugu News
mictv telugu

సరికొత్త ఫీచర్స్‌తో ఐఫోన్13

September 15, 2021

Iphone13 with the latest features

స్మార్ట్‌ఫోన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న   యాపిల్ ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13,ఐఫోన్ 13ప్రో , ఐఫోన్ 13 ప్రో మాక్స్‌లను  టెక్ దిగ్గజం యాపిల్  మంగళవారం విపణిలోకి విడుదల చేసింది.ఆధునాతన ఫీచర్లతో వీటికి సరికొత్తగా ఆవిష్కరించింది.కొత్తగా నీలం,గులాబీ తదితర అయిదు రంగుల్లో వీటిని తీసుకొచ్చింది.

వెనుకవైపు అధునాతన 12 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో డ్యూయల్‌ కెమెరాలు, 5జీ, 6 కోర్‌ సీపీయూ, 4 కోర్‌ జీపీయూ,ఈ సిరీస్‌లన్నీ బయానిక్ ప్రాసెసర్‌తో వచ్చాయి. ఐఫోన్‌ 13 డిస్‌ప్లే 6.1 అంగుళాలు, మినీ డిస్‌ప్లే 5.4 అంగుళాలుగా ఉంటుంది. ఐఫోన్‌ 12 మినీతో పోలిస్తే ఐఫోన్ 13 మినీ బ్యాటరీ సామర్థ్యం 1.5 గంటలు, ఐఫోన్‌ 12తో పోలిస్తే ఐఫోన్‌ 13 బ్యాటరీ సామర్థ్యం 2.5 గంటలు ఎక్కువగా ఉంటుంది. ఇవి అత్యధిక బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి అని కంపెనీ తెలిపింది. ఐఫోన్‌ 13 మినీ రేటు 699 డాలర్ల నుంచి, ఐఫోన్‌ 13 ధర 799 డాలర్ల నుంచి, ఐఫోన్ ప్రో ధర 999 డాలర్ల నుంచి, ఐఫోన్ ప్రో మ్యాక్స్‌ రేటు 1,099 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. 

దేశీయంగా ఐఫోన్ 13 మినీ రూ.69,900, ఐఫోన్ 13 రూ.79,900,ఐఫోన్ 13ప్రో రూ.1,19,900,ఐఫోన్ 13ప్రో మాక్స్ 1,29,900 నుంచి ప్రారంభమవుతాయి. అన్ని ఫోన్‌ల స్టోరేజీ మెమొరీ 128 జీబీతో మొదలవుతుంది. 256 జీబీ, 512 జీబీ వేరియంట్లలో కూడా  విడుదల చేసింది.