ఐపీఎల్ విజేత ఆ జట్టే.. జోతిషుడు - MicTv.in - Telugu News
mictv telugu

ఐపీఎల్ విజేత ఆ జట్టే.. జోతిషుడు

May 12, 2019

మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టే గెలిస్తుందని జ్యోతిషుడు గ్రీన్‌స్టోన్‌ లోబో తెలిపారు. ఈసారి గ్రహాలన్నీ ముంబయి ఇండియన్స్‌కే అనుకూలంగా ఉన్నాయని, జట్టులో ఆటగాళ్ల వయసు సగటు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని అన్నారు. తదనుగుణంగా 2013, 2015 సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా ఆ జట్టే విజయం సాధిస్తుందని చెప్పారు. భారత క్రికెట్‌ జట్టులో జాతకం ప్రకారం ధోనీని వెనకకు నెట్టి రోహిత్ శర్మ ఎక్కువ ట్రోఫీలు గెలిచే అవకాశం వుందన్నారు. అలాగే రోహిత్‌శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ఉత్తమ కెప్టెన్‌ అవుతాడన్నారు. గతేడాది ధోనీకి యరేనస్ గ్రహం అనుకూలంగా వుందని.. ఈసారి రోహిత్ శర్మకు అనుకూలంగా వుందని తెలిపారు.  

IPL 2019 Final MI vs CSK MS Dhoni or Rohit Sharma- who will lift the trophy again Astrologer Greenstone Lobo predicts

గత సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఛాంపియన్‌గా నిలిచినప్పటికీ.. ఈసారి అది పునరావృతం కాదని అన్నారు. అయితే, ఆయన జోతిషాన్ని క్రికెట్ అభిమానులు కొట్టి పారేస్తున్నారు. ఇదంతా ట్రాష్‌ అంటున్నారు. గతేడాది ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ సందర్భంలో కూడా ఆయన జోస్యం చెప్పారు.