సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి విక్టరీ.. మలుపు తిప్పిన రషీద్ - MicTv.in - Telugu News
mictv telugu

సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి విక్టరీ.. మలుపు తిప్పిన రషీద్

September 30, 2020

nvgn

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి విక్టరీని నమోదు చేసింది. ఢిల్లీ జట్టుపై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్ తీరుతో అదరగొట్టాడు. దీంతో కోలుకోలేని దెబ్బ తిన్న ఢిల్లీ కేపిటల్స్ ఆటగాళ్లు చేతులెత్తేశారు.  

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. తక్కువ లక్ష్యంతోనే బరిలోకి దిగిన ఢిల్లీ ఆటగాళ్లు ఓ దశలో విజయం దిశగా సాగారు. వేగంగా పరుగులు తీస్తూ వచ్చారు. కానీ ఊహించని రీతిలో రషీద్ ఖాన్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. శిఖర్ ధవన్,శ్రేయాస్ అయ్యర్,రిషభ్ పంత్ లాంటి బ్యాట్స్‌మెన్లను ఫెవిలియన్‌కు పంపించాడు. దీంతో విజయం హైదరాబాద్ వశమైంది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ వార్నర్ 45 పరుగులు చేసి శుభారంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత విలియమ్స్ కూడా బంతిని బౌండరీ దాటించాడు. రషీద్ ఖాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.