కేఎల్ రాహుల్ మెరుపు సెంచరీ.. మరో రికార్డు కైవసం - MicTv.in - Telugu News
mictv telugu

కేఎల్ రాహుల్ మెరుపు సెంచరీ.. మరో రికార్డు కైవసం

September 24, 2020

IPL 2020, KXIP vs RCB.

ఐపీఎల్‌లో సచిన్ నెలకొల్పిన రికార్డ్‌ని బ్రేక్ చేసిన తరువాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో రికార్డు కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో వేగంగా 2,000 పరుగుల మైలురాయిని అందుకున్న భారత బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ నిలిచిన సంగతి తెల్సిందే. సచిన్ టెండూల్కర్ 63 ఇన్నింగ్స్‌లతో ఉన్న రికార్డ్‌ని రాహుల్ 59 ఇన్నింగ్స్‌లలో బ్రేక్ చేశాడు. అలాగే ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌తో దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ (132 నాటౌట్: 69 బంతుల్లో 14×4, 7×6)తో మెరుపు సెంచరీ చేశాడు. దీంతో ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 

ఇది రాహుల్‌కి రెండవ ఐపీఎల్ సెంచరీ. దీంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. పంజాబ్ ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్ (26), పూరన్(17), మాక్స్వెల్ (5), కరుణ్ నాయర్(15 నాటౌట్) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో శివమ్ దూబే రెండు, చాహల్ ఒక వికెట్ తీశారు. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. పడిక్కల్(1), ఫిలిప్(0), కెప్టెన్ కోహ్లీ(1) స్వల్ప స్కోర్ లకే అవుట్ అయ్యారు. దీంతో బెంగళూరు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఫించ్(3), డివిలియర్స్(1) క్రీజ్ లో ఉన్నారు. బెంగుళురు 4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 7 పరుగులు చేసింది.