మంగళవారం ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లలో ఏకంగా 219 పరుగుల భారీ స్కోరు చేసింది. దుబాయ్ స్టేడియంలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు. హైదరాబాద్ ఆటగాళ్లలో వార్నర్ (66). సాహా(87) పరుగులతో ఢిల్లీ బౌలర్లపై చెలరేగారు. అలాగే మనీశ్ పాండే 44, విలియమ్సన్ 11 పరుగులు చేయడంతో హైదరాబాద్ భారీ స్కోర్ సాధించింది. 220 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఢిల్లీని హైదరాబాద్ బౌలర్లు కట్టడికి చేశారు.
దీంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే 131 పరుగులకే ఢిల్లీ జట్టు ఆల్ అవుట్ అయింది. ఢిల్లీ ఆటగాళ్లలో అజింక్య రహానే (26), రిషభ్ పంత్ (36), తుషార్ (20), హెట్మయర్ (16) పరుగులు చేశారు. శిఖర్ ధవన్ గోల్డెన్ డక్ కాగా, ఆరుగురు ఆటగాళ్లు కలిపి మొత్తం 24 పరుగులు మాత్రమే చేశారు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా, సందీప్ శర్మ, నటరాజన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. నదీమ్, విజయ్ శంకర్, హోల్డర్ చెరో వికెట్ పడగొట్టారు. హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన సాహాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ప్లే ఆఫ్స్ ముంగిట ఢిల్లీకి ఇది వరుసగా మూడో ఓటమి. ఈ విజయంతో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం అయ్యాయి.