పాటిదార్ కొట్టిన సిక్సర్‌కు గాయపడ్డ అభిమాని - MicTv.in - Telugu News
mictv telugu

పాటిదార్ కొట్టిన సిక్సర్‌కు గాయపడ్డ అభిమాని

May 14, 2022

ఐపీఎల్ 2022లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 54 పరుగుల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఈ మ్యాచులో ప్రేక్షకుల్లో కూర్చున్న క్రికెట్ అభిమాని గాయపడ్డాడు.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటర్ రజత్ పాటిదార్ కొట్టిన ఓ భారీ సిక్స్ వృద్ధ అభిమాని గుండుపై పడింది. పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్‌ ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని హర్‌ప్రీత్ వేయగా.. పాటిదార్ లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేచి స్టేడియం లోపల పడింది. ముందు స్టాండ్ పైకప్పును తాకిన ఆ బంది.. ఆపై ఓ వృద్ధుడి గుండుపై పడింది.బంతి తాకిన వెంటనే ఆ అభిమాని నొప్పితో విలవిలలాడిపోయాడు. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు గుండుపై రుద్దడంతో కాస్త కూల్ అయ్యాడు. బంతి ముందుగా పైకప్పును తాకి, ఆ తర్వాత అతని తలపై పడడంతో పెద్దగా గాయం కాలేదు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.