ఐపీఎల్ -2023 మినీ వేలంలో క్రికెట్లరు కోట్లకొల్లగొట్టారు. బ్యాట్‌తో పాటు బంతితో రాణించే వారికోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న ఆల్ రౌండర్స్ ఫ్రాంచైజీలు కోట్లు ఖర్చు చేసి దక్కించుకున్నాయి. సామ్ కరన్, కామెరూన్ గ్రీన్ ,స్టోక్స్, హ్యారీ బ్రూక్ వంటి ఆటగాళ్ల కోసం పోటీపడ్డాయి..
సామ్ కరన్ @ రూ.18.50 కోట్లు (pbks)
ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అతడిని దక్కించుకునేందు కోట్లు గుమ్మరించారు. చివరికి పంజాబ్ రూ.18.50 కోట్లకు దక్కించుకుంది. సామ్ కోసం మొదట ముంబాయి, బెంగళూరు పోటీ పడ్డాయి. తర్వాత చెన్నై ఎంటర్ కావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. చివరికి పంజాబ్ అతడి కోసం పట్టుబడడంతో ఐపీఎల్ రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయాడు.
కామెరాన్ గ్రీన్ 17.5 కోట్లు (mi)
పొలార్డ్ లోటు భర్తీ చేయాలని భావించినా ముంబై ఇండియన్స్ అందుకు ఆస్ట్రేలియా ఆటగాడి కోసం పోటీ పడి దక్కించుకుంది. ఏకంగా రూ.17.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన రెండో ఆటగాడిగా గ్రీన్ ఉన్నాడు.
స్టోక్స్ @16.25 కోట్లు (csk)
2 కోట్ల బేస్ ధరలో ఉన్న ఊహించినట్టుగానే భారీ ధరకు అమ్ముడుపోయాడు. అతడి కోసం బెంగళూరు, లక్నో, రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్ పోటీ పడ్డాయి. లక్నో అతడి తీవ్రంగా ప్రయత్నించానా..16.25 కోట్లు వెచ్చించి చెన్నై దక్కించుకుంది.
జేసన్ హోల్డర్ @5.75 కోట్లు (rr)
వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ మరోసారి ఐపీఎల్ వేలంలో సత్తా చాటాడు. అతడిని రాజస్థాన్ రాయల్స్ 5.75 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌లో ఆడిన హోలర్డ్ రాణించకపోవడంతో విడుదల చేసింది.
సికిందర్ రజాకు రూ.50 లక్షలే..
జింబాబే ఆల్‌రౌండర్ సికిందర్ రజాను రూ.50 లక్షలు వెచ్చించి పంజాబ్ దక్కించుకుంది. టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించినా సికిందర్ రజా భారీ ధరకు అమ్ముడుపోతాడని భావించానా అతడిపై ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. వెస్టిండీస్ ఆటగాడు ఒడియన్ స్మిత్‌ను గుజరాత్ టైటాన్స్‌కు 50 లక్షలకు కొనుగోలు చేసింది.