ఐపీఎల్-2023 వేలానికి సమయం దగ్గరపడుతోంది. డిసెంబర్ 23న వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 404 మంది ప్లేయర్స్ వేలానికి అందుబాటులో ఉన్నారు. దీంతో కీలక ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కన్నేశాయి. కావాల్సిన ఆటగాళ్లును దక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఓపెనర్స్, టాప్ ఆర్డర్ బ్యాటర్లను దక్కించుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడికోసం ఆన్వేషిస్తుంది. ఈ క్రమంలోనే 2022లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న టీం ఇండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్‌ను దక్కించుకోవాలని చూస్తోందంట. సన్‌రైజర్స్ హైదరాబాద్ రాబోయే సీజన్ కోసం కేన్ విలియమ్సన్తో పాటు నికోలస్ పూరన్‌లను విడుదల చేసింది. వారి స్థానాలను భర్తీ చేసేందుకు ఓ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అవసరం. దీంతో మయాంక్‌ను తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన అభిప్రాయంగా భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. “మయాంక్ జట్టును నడిపించగలడు, స్వేచ్ఛగా బ్యాటింగ్ ఆడతాడు.అతడిని సన్ రైజర్స్ కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉంది.” అని స్టార్ స్పోర్ట్స్గేమ్ ప్లాన్ వేలం స్పెషల్ షోలో పఠాన్ వ్యాఖ్యానించాడు. ఆడమ్ జంపా కోసం కూడా హైదరాబాద్, పంజాబ్ పోటీ పడొచ్చని చెప్పాడు. ప్రస్తుతం హైదరాబాద్ అత్యధికంగా రూ.42.25 కోట్లు కలిగి ఉంది. ఆ తర్వాత రూ.32.2 కోట్లతో పంజాబ్ ఉంది.
ఇవి కూడా చదవండి :
మెస్సీ చేసిన రెండో గోల్ చెల్లదు.. ఫ్రాన్స్ అభిమానులు
కప్పు గెలిచిన అర్జెంటీనా.. అభిమానంతో 1500 మందికి ఫ్రీ చికెన్ బిర్యానీ
రిటైర్మెంట్ ప్రకటించిన ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ప్లేయర్