ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం…టాస్ ఆలస్యం
అహ్మదాబాద్‌లో భారీ వర్షం కారణంగా చెన్నై-గుజరాత్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం అవుతోంది. వర్షం తగ్గాక పిచ్‌ను పరిశీలించి టాస్ వేయనున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే..?
ఆదివారం (మే 28) వర్షం కారణంగా మ్యాచ్ ఆడలేకపోతే.. సోమవారం నాడు ఫైనల్స్ నిర్వహిస్తారు. అందుకు ఆ రోజును బీసీసీఐ రిజర్వ్ డే గా ప్రకటించింది. అదే విధంగా మ్యాచ్ మొదలయ్యాక వర్షం పడి ఆటకు అంతరాయం ఏర్పడితే.. మ్యాచ్ ఎక్కడ ఆగిందో అన్నిడి నుంచి రిజర్వ్ డే రోజు ప్రారంభిస్తారు. ఇవి కాకుండా బీసీసీఐ రూల్స్ ప్రకారం వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా స్టార్ట్ అయినా.. రాత్రి 9.40 గంటలలోపు మ్యాచ్ ప్రారంభించాల్సి ఉంటుంది. అలా అయితే ఓవర్లలో కోత విధించరు.
రాత్రి 9.40 గంటల వరకు వర్షం పడి ఆగిపోతే.. అప్పుడు ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అదీ సాధ్యం కాకపోతే.. రాత్రి 1:20 గంటల వరకు చూస్తారు. అప్పుడు వర్షం తగ్గితే సూపర్ ఓవర్ ఆడిస్తారు. అయితే, సోమవారం రోజు కూడా వర్షం పడితే.. టేబుల్ టాపర్ గా నిలిచిన గుజరాత్ జట్టును విజేతగా ప్రకటిస్తారు.