IPL 2023 : ఈసారి ఐపీఎల్ విన్నర్, రన్నర్లకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
ఐపీఎల్ 16వ సీజన్‌కు ఈ ఆదివారంతో ఎండ్ కార్డ్ పడనుంది. సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో ఆడిన చెన్నై, గుజరాత్ జట్లే ఫైనల్లోనూ తలపడనున్నాయి. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధించినా.. రికార్డే అవుతుంది. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే.. ఐపీఎల్ చరిత్రలో ఐదో టైటిల్ సాధించిన జట్టుగా ముంబయి ఇండియన్స్ సరసన నిలుస్తుంది. మరోవైపు గుజరాత్ విజయం సాధిస్తే.. ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఏడాది నుంచే వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి రికార్డులకెక్కుంది. మరి చెన్నై పాంచ్ పటాకానా… గుజరాత్ డబుల్ ధమాకానా అనేది ఆదివారం అర్థ్రరాత్రి వరకు వేచి చూడాలి.
ఇక ఈ సీజన్‌లో ప్రైజ్ మనీ విషయానికొస్తే… ఛాంపియన్‌గా నిలిచే జట్టు రూ.20 కోట్లు దక్కించుకుంటుంది. రన్నరప్‌గా నిలిచే టీమ్‌కు రూ. 13 కోట్లు ఇవ్వనున్నారు. అదే విధంగా మూడో స్థానంలో నిలిచిన ముంబయికి రూ. 7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన లక్నోకు రూ.6.5 కోట్లు ఇవ్వనున్నారు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌కు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు రూ.15 లక్షల ప్రైజ్‌మనీ అందుకుంటారు. ఇక ఇవే కాకుండా సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచిన ఆటగాడు రూ.15 లక్షలు దక్కించుకుంటారు. అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన ప్లేయర్, గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచిన ఆటగాళ్లు చెరో రూ.12 లక్షలు దక్కించుకుంటారు. క్రాక్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ కు కూడా రూ. 12 లక్షల ప్రైజ్ మనీ దక్కనుంది.
2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పుడు అప్పటివరకూ క్రికెట్ పై ఉన్న అభిప్రాయాన్ని మార్చేయడమే కాకుండా ప్రైజ్ మనీ విషయంలోనూ గణనీయమైన మార్పును తీసుకొచ్చింది. అప్పట్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.4.8 కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చారు. రన్నరప్‌కు తొలి రెండు ఎడిషన్లలోనూ రూ.2.4 కోట్లు లభించాయి. అప్పట్లో ఇదే అత్యధిక ప్రైజ్ మనీ. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత ఐపీఎల్ 2023లో విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ లభించబోతోంది. రేపు జరిగే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, చెన్నె సూపర్ కింగ్స్ జట్లలో విజేతగా నిలిచిన వారికి ఈ మొత్తం లభించబోతోంది. అలాగే రన్నరప్ కు రూ.13 కోట్ల మొత్తం లభించనుంది. ఈ లెక్కన చూస్తే ఐపీఎల్ తొలి సీజన్ తో పోలిస్తే ప్రైజ్ మనీ దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని తెలుస్తోంది.