ఐపీఎల్ 2023 సీజన్ 16 మ్యాచులకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మార్చి 31న తొలిమ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని నరేంద్రమోదీ స్టేడియంలో ప్రారంభవేడుకలు అట్టహాసంగా జరుగనున్నాయి. మార్చి 31 నుంచి మే 21 వరకు లీగల్ మ్యాచులు జరుగుతాయి. ఇందులో మొత్తం 70 మ్యాచులు ఉండగా, ఇందులో 18 డబుల్ హెడర్స్ ఉన్నాయి. అయితే లీగ్ మ్యాచుల వరకే షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ని ప్రకటించాల్సి ఉంది. ఇక ఐపీఎల్‌లో ఒక్కో జట్టు 14 మ్యాచులు ఆడాల్సి ఉండగా, హొంగ్రౌండులో 7, బయట నగరాల్లో ఏడు మ్యాచులు ఆడనున్నాయి. ఇవన్నీ స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రసారం కానున్నాయి. అటు ఇప్పటికే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం పూర్తయింది. దీంతో రానున్న కాలం పండుగ వాతావరణం నెలకొంటుందని క్రికెట్ ప్రేమికులు సంబరపడుతున్నారు.