సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌ను నియమించింది. జట్టు సారథిగా మార్క్రమ్ను ప్రకటించింది. భారత్ ఆటగాడు మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్‌గా నియమిస్తారని అందరూ భావించినా చివరికి యాజమాన్యం విదేశీ కెప్టెన్సీపై నమ్మకముంచింది. ఈ దక్షిణాఫ్రికా ప్లేయర్ ఐపీఎల్ లో 2022 నుంచి హైదరాబాద్‌కు ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో మార్క్రమ్ కేవలం 20 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన SA T20 లీగ్‌లో సన్ రైజర్స్ ఈస్ట్రర్న్ జట్టుకు నాయకత్వం వహించి ట్రోఫీ సాధించి పెట్టాడు. గతంలో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుకు కూడా నాయకత్వం వహించిన అనుభవం ఉంది.
THE. WAIT. IS. OVER. ⏳#OrangeArmy, say hello to our new captain Aiden Markram 🧡#AidenMarkram #SRHCaptain #IPL2023 | @AidzMarkram pic.twitter.com/3kQelkd8CP
— SunRisers Hyderabad (@SunRisers) February 23, 2023
2016లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో తొలి ఐపీఎల్ టైటిల్ ను గెలిచింది. దాని తర్వాత.. ఇక ఐపీఎల్(IPL) ట్రోఫీ ఆశగానే మిగిలిపోయింది. కేన్ విలియమ్స్‌న్ సారథ్యంలో జట్టు ఆశించినంత మేర రాణించలేదు. వార్నర్ గత సీజన్లోనే సన్ రైజర్స్ ను వీడగా..ఈ సీజన్ కు ముందు విలియమ్సన్ ను సన్ రైజర్స్ విడిచింది. దీంతో జట్టు కెప్టెన్సీపై సుదీర్ఘంగా చర్చించి చివరికి మార్క్రమ్కు కట్టబెట్టింది. ఇక కొత్త కెప్టెన్ మార్క్రమ్సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాలి.