ఐపీఎల్ ఛాంపియన్స్పై కోట్ల వర్షం.. ఎమర్జింగ్ ప్లేయర్కు భారీ ప్రైజ్ మనీ
ఐపీఎల్ 2023 సమరం తుది అంకానికి చేరుకుంది. రేపు (మే 28) అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో చెన్నై, గుజరాత్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్యాష్ లీగ్లో ప్రతిభ ఉన్న వాళ్లపై కాసుల వర్షం కురుస్తుందన్న విషయం తెలిసింది. అయితే, ఈ లెక్కన ఐపీఎల్ ఛాంపియన్కు, ప్లేఆఫ్స్కు క్వాలిఫై అయిన జట్లకు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ అందిస్తారో తెలుసా..?
ఈ ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచిన జట్టుకు రూ. 20 కోట్లు, రన్నరప్ కు రూ.13 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ ఓ నివేదికలో తెలిపింది. ఎలిమినేటర్ విజేత ముంబైకి రూ. 7 కోట్లు, ఎలిమినేటర్లో ఓడిపోయిన లక్నోకు రూ. 6.5 కోట్ల నగదు బహుమతి దక్కనుంది.
ఏ ఆటగాడికి ఎంతంటే..
ఐపీఎల్ 2023లో అత్యధిక పరుగులు సాధించిన వ్యక్తికి ఆరెంజ్ క్యాప్తో పాటు ప్రైజ్ మనీగా రూ. 15 లక్షలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం 16 మ్యాచుల్లో 851 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ .. అగ్రస్థానంలో ఉన్నాడు. అతనికి పోటీగా ఏ ప్లేయర్ బరిలో లేడు. పర్పుల్ క్యాప్ గెలుచుకున్న ఆటగాడికి కూడా రూ. 15 లక్షల ప్రైజ్ మనీ దక్కనుంది. ఈ రేసులో గుజరాత్ టీం సభ్యులు షమీ (28), రషీద్ ఖాన్ (27), మోహిత్ శర్మ (24) ముందున్నారు. ఈ సీజన్లో సూపర్ స్ట్రైక్ అవార్డు గెలుచుకున్న బ్యాట్స్మెన్కు ప్రైజ్ మనీగా రూ. 15 లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్కు రూ. 20 లక్షలు ఇవ్వనున్నారు.