ఐపీఎల్-2023 వేలానికి సమయం ఆసన్నమవుతోంది. కొద్ది గంటల్లో కొచ్చి వేదికగా వేలం జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. 405 మంది ఆటగాళ్లు వేలానికి అందుబాటులో ఉన్నారు. వీరిలో 273 మంది ఇండియన్ క్రికెటర్లు కాగా.. 132 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. పది ఫ్రాంచైజీలు కలిసి 87 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. మ్యాచ్ విన్నర్స్ పై కోట్లు వర్షం కురిపించేందుకు ఫ్రాంచైజీలు రెఢీగా ఉన్నాయి. మ్యాచ్ ను మలుపు తిప్పే బౌలర్‌ను జట్టులోకి తెచ్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. వేలానికి అందుబాటులో ఉన్న బెస్ట్ బౌలర్స్‌పై కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ కింద ఉన్న బౌలర్స్‌పై టీమ్ మేనెజ్మెంట్స్ కన్నేసినట్లు తెలుస్తోంది.
1. ఆడమ్ మిల్నే
న్యూజిలాండ్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే. గత కొన్ని సంవత్సరాలుగా టీ20 క్రికెట్లో రాణిస్తున్నాడు. మెరుపు వేగంతో మిల్నే విసిరిన బంతులను బ్యాటర్లు ఎదుర్కోవడం కొంచెం కష్టమే. వేగంతో ఖచ్చితమై లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేసే సామార్థ్యం అతనికి ఉంది. మిల్నే పదునైన యార్కర్లు సంధించడంలో దిట్ట. ఈ ఐపీఎల్ వేలంలో ఇతడికి ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది.
2. రీస్ టోప్లీ
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ టోప్లీ ఈ మధ్యకాలంలో అంతర్జాతీయా క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 6 అడుగుల 7 అంగులాల పొడవు ఉన్న టోప్లీ..తన పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.
భారత్ పిచ్‌లపై బౌన్సర్లు సంధించి బ్యాటర్లను టోప్లీ ఇబ్బంది పెట్టే అవకాశ ఉంది. 2022 సంవత్సరం ప్రారంభంలో భారత్‌పై టోప్లీ రాణించాడు. 75 లక్షల ప్రాథమిక ధరతో ఉన్న అతడిపై కోట్లు కురిసే అవకాశం ఉంది.
ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో రాణించిన ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌పై ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరిచే అవకాశం ఉంది. ఉపఖండం యొక్క టర్నింగ్ ట్రాక్‌లపై అతడు రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అతడు బ్యాట్‌తో కూడా మెరుపులు మెరిపించగలడు కాబట్టి రషీద్‌కి మంచి డిమాండ్ ఏర్పడింది.
4. ఆడమ్ జంపా
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపాను లాక్కునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడొచ్చు. ప్రస్తుతం బీబీఎల్‌లో రాణించి ఐపీఎల్ యాజమాన్యాల దృష్టిలో ముందు వరుసలో ఉన్నాడు. అంతే కాకుండా
ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో కూడా జంపా అదరగొట్టాడు. గతంలో ఐపీఎల్ అనుభవం..భారత్ పిచ్ లపై అవగాహన కారణంగా జంపా మంచి ధర పలికే అవకాశం ఉంది.
5. విద్వాత్ కావేరప్ప
కర్ణాటకకు చెందిన రైట్ ఆర్మ్ మీడియం బౌలర్ కావేరప్ప ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా T20లో అతని రికార్డులు ఆశాజనకంగా ఉన్నాయి. విజయ్ హజారే ట్రోఫీలోనూ విద్వాత్ కావేరప్ప సత్తా చాటాడు. టోర్నిలో మొత్తం 17 వికెట్లు సాధించాడు. ఇతడు కూడా ఫ్రాంచైజీల దృష్టిలో మొదటి వరుసలోనే ఉన్నాడు.
ఇవి కూడా చదవండి :
చెలరేగిన ఉమేష్, అశ్విన్..బంగ్లాదేశ్ ఆలౌట్..
ఐపీఎల్-2023 వేలానికి సర్వం సిద్ధం.. కోటికి పైగా బేస్ ప్రైస్‌లో ఉన్న ఆటగాళ్లు వీరే..