సూపర్ ఓవర్‌లో బెంగుళూరు సూపర్ విక్టరీ - MicTv.in - Telugu News
mictv telugu

సూపర్ ఓవర్‌లో బెంగుళూరు సూపర్ విక్టరీ

September 29, 2020

ngvj

ఐపీఎల్‌ 2020 సీజన్‌లో ఆటగాళ్లు హోరా హోరీగా తలపడుతున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ముంబై ఇండియన్స్‌తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌ తీవ్ర ఉత్కంఠ రేపింది. సూపర్ ఓవర్‌లో చివరకు కొహ్లీ జట్టు విజయం సాధించింది. ఈ సూపర్ ఓవర్ మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పింది. దీంతో ఆ జట్టు అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. రెండు జట్లు పోటా పోటీగా 201 పరుగులను చేయడం విశేషం. 

ఈ మ్యాచ్‌లో జట్లు హోరాహోరీగా ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగుళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. భారీ లక్ష చేధనతో బరిలోకి వచ్చిన ముంబై ఆటగాళ్లు కూడా దూకుడుగా ఆడారు. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి సమయం చేశారు. దీంతో మ్యాచ్ డ్రా కావడంతో సూపర్ ఓవర్ తప్పలేదు. ఈ ఓవర్‌లో ముంబై వికెట్‌ కోల్పోయి 7 రన్స్ చేసింది. ఆ తర్వాత 8 పరుగులు లక్ష్యంతో  ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లీ వచ్చారు. తొలి బంతికి సింగిల్‌ తీసిన డివిలియర్స్‌ నాలుగో బంతికి ఫోర్‌ బాదాడు. చివరి బంతికి  కోహ్లీ సింగిల్‌ తీసి విక్టరీ సాధించిపెట్టాడు.