డిపాజిటర్ల డబ్బుతో ఐపీఎల్ బెట్టింగ్.. పోస్టు మాస్టర్ అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

డిపాజిటర్ల డబ్బుతో ఐపీఎల్ బెట్టింగ్.. పోస్టు మాస్టర్ అరెస్ట్

May 25, 2022

పోస్టాఫీసు ఖాతాల్లో కస్టమర్లు డిపాజిట్ చేసిన డబ్బుతో ఐపీఎల్ బెట్టింగ్ ఆడి జైలు పాలయిన పోస్టుమాస్టర్ కథ ఇది. వివరాలు.. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బినా సబ్ పోస్టాఫీసులో విశాల్ అనే వ్యక్తి పోస్టు మాస్టరుగా పనిచేస్తున్నాడు. అయితే ప్రజలు పొదుపు చేసిన సొమ్మును వారి అకౌంటులో జమ చేయవలసిన విశాల్.. వాటిని పక్కదారి పట్టించాడు. దాదాపు 24 మందికి చెందిన కోటి రూపాయలను ఐపీఎల్ బెట్టింగ్ కాసి పోగొట్టుకున్నాడు. ఖాతాదారులకు నకిలీ పత్రాలు ఇచ్చి మోసం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు విశాల్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో గత రెండేళ్లుగా ఈ పని చేస్తున్నట్టు ఒప్పుకోవడంతో పోలీసులు రెండు సెక్షన్ల కింద విశాల్‌పై కేసు నమోదు చేశారు. ఇంకా కొన్ని విషయాలు వెల్లడి కావాల్సి ఉందనీ, అవి రుజువైతే మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.