IPL crosses $10 billion valuation to become a decacorn
mictv telugu

భారీగా పెరిగిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ…

December 21, 2022

ప్రపంచ క్రికెట్‌ లీగ్స్‌లో ఎక్కువ క్రేజ్ ఉన్నది ఐపీఎల్. ఐపీఎల్‎లో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కలలు కంటాడు. క్రికెట్ అభిమానులు కూడా ఐపీఎల్ మ్యాచ్‌‌లను ఇంట్రెస్టింగ్ చూస్తారు. ఇక మార్కెట్లో ఐపీఎల్ కూడా అంతే స్థాయిలో బిజినెస్ చేస్తోంది. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ వాల్యూ 10.9 బిలియన్ డాలర్లను దాటిపోయింది. 2020లో ఐపీఎల్ బ్రాండ్ విలువ 6.2 బిలియన్ డాలర్లు ఉండగా ప్రస్తుతం అది అమాంతం పెరిగిపోయినట్లు డీ అండ్ పీ అడ్వైజరీ సంస్థ పేర్కొంది. 2022లో ఐపీఎల్ విలువ 10.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు తాజాగా ప్రకటించింది.

2023-2027 కోసం IPL మీడియా హక్కుల వేలం నేపథ్యంలో వాల్యుయేషన్ పెరిగింది. సంయుక్త మీడియా హక్కులు సుమారు 6.2 బిలియన్లకు విక్రయించబడ్డాయి. ఇది మునపటి కంటే మూడు రెట్లు ఎక్కువ. ఐపీఎల్ రెండు జట్లు కొత్తగా వచ్చి చేరడంతో వాల్యూ పెరిగింది. జట్ల పెరుగుదలతో మ్యాచ్‎ల సంఖ్య 74 నుంచి 94కు పెరగడడంతో మీడియా హక్కులు భారీగా అమ్ముడయ్యాయి. విడిగా ఐపీఎల్ ఫ్రాంచైజీ విలువ 400-600 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని డీ అండ్ పీ అడ్వైజరీ మేనేజింగ్ పార్ట్ నర్ సంతోష్ పేర్కొన్నారు. ఐపీఎల్ విలువ 10 బిలియన్ డాలర్లు దాటిపోవడంతో దీనిని డెకాకార్న్‎గా డీ అండ్ పీ అడ్వైజరీ సంస్థ పేర్కొంది.