ఐపీఎల్ ప్రైజ్ మనీ.. ఎవరికెంతంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఐపీఎల్ ప్రైజ్ మనీ.. ఎవరికెంతంటే..

May 13, 2019

దాదాపు 50 రోజుల పాటు క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచిన పొట్టి క్రికెట్ టోర్నీ ఐపీఎల్‌ ఎట్టకేలకు ఆదివారం రోజున ముగిసింది. ఎన్నో రికార్డులు బద్దలైన.. సిక్సర్లతో స్టేడియాలు హోరెత్తిపోయిన ఈ టోర్నీని ముంబై ఇండియన్స్ ఎగరేసుకుపోయింది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో ముంబై జట్టు కప్ గెలిచింది. ముంబై ఇండియన్స్ కప్ గెలవడం ఇది నాల్గోసారి. విజేత, రన్నరప్ జట్లతో పాటు వివిధ విభాగాలకు క్రీడాకారులకు కూడా ప్రైజ్ మనీ అందజేశారు. ఆ వివరాలు చూద్దాం.

IPL Final 2019 Prize money on offer and all the other awards, cash reward - Everything to know.

ప్రైజ్ మనీ వివరాలు:

* విన్నర్ టీమ్ ముంబైకి రూ.20 కోట్లు

* రన్నర్ టీమ్ చెన్నైకి రూ.12.5 కోట్లు

* ఐపీఎల్ 12 సీజన్ ఉత్తమ్ క్యాచ్‌: శార్దూల్ ఠాకూర్‌కు రూ.10 లక్షలు

* గేమ్ ఛేంజర్: రాహుల్ చాహర్‌కు రూ. 10 లక్షలు

* స్టైలిష్‌ ప్లేయర్: కేఎల్ రాహుల్‌కు రూ.10 లక్షలు

* మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్: బుమ్రాకు రూ. 5 లక్షలు

* పర్పుల్ క్యాప్: ఇమ్రాన్ తాహిర్‌కు రూ. 10 లక్షలు

* ఆరెంజ్ క్యాప్‌: డేవిడ్ వార్నర్‌కు రూ. 10 లక్షలు

* వర్ధమాన క్రికెటర్: శుభ్‌మన్‌గిల్‌కు రూ. 10 లక్షల ప్రైజ్ మనీ పొందారు.