నేటి నుంచే ఐపీఎల్ షురూ.. ఈసారి.. - MicTv.in - Telugu News
mictv telugu

నేటి నుంచే ఐపీఎల్ షురూ.. ఈసారి..

March 26, 2022

ipl

క్రికెట్ అభిమానులు గతకొన్ని రోజులుగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు జరుగుతాయి, ఎప్పుడెప్పుడు తన అభిమాన క్రికెటర్ ఆట చూడాలని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. నేటి నుంచే 15వ సీజన్ మొదలుకానుంది. ఏటా ఉండేదే కదా ఈసారి కొత్తగా ఏముంది అనుకుంటున్నారా? ఈసారి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఎప్పట్లా ఈసారి ఆడబోయేది ఎనిమిది జట్లు కాదు. పది జట్లు. అంటే రెండు జట్లు పెరిగాయి. దీంతో మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగింది. గత సీజతో పోలిస్తే, జట్ల ముఖచిత్రాలు మారిపోయాయి. ఈసారి ఒకటి కాదు రెండు కాదు. ఏకంగా ఆరు జట్లకు కొత్త కెప్టెన్లను చూడబోతున్నాం. అన్నింటికీ మించి కరోనా కారణంగా వరుసగా రెండేళ్లు వాయిదాలు పడి, ఒకసారి పూర్తిగా, ఇంకోసారి సగం సీజన్ విదేశాలకు తరలిన లీగ్.. ఈసారి స్వదేశంలో షెడ్యూల్ ప్రకారం అది కూడా మన అభిమానుల మధ్యే జరగబోతుండటం విశేషం.

ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు ఎదురుచూసిన ఐపీఎల్ మ్యాచ్‌లు మరికొద్ది గంటల్లో మొదలుకానున్నాయి. ఇప్పటిదాకా లీగ్ చరిత్రలో ఒక్క 2011 సీజన్లో మాత్రమే పది జట్లు పోటీ పడ్డాయి. ఈసారి మ్యాచ్ సంఖ్య కూడా పెరిగింది. అందుకే ఈసారి మార్చి చివరి వారం నుంచే లీగులను మొదలు పెట్టేస్తున్నారు. శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడబోతున్నాయి. అయితే, ఈసారి లీగ్‌ను ముంబయి, పుణె నగరాలకు పరిమితం చేశారు. ముంబయిలోని వాంఖడె, బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాలు, పుణెలోని ఎంసీఏ మైదానం మ్యాచ్‌లకు సిద్దమైయ్యాయి.

మరోవైపు వాంఖడే వేదికగా శనివారం సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే, క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభానికి ముందు సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకుని అందరనీ షాక్‌ గురిచేశాడు. అతడి స్థానంలో నూతన కెప్టెన్‌గా రవీంద్ర జడేజా ఎంపికయ్యాడు. ఇక ఇరు జట్లు కూడా ఈ ఏడాది సీజన్‌లో సరికొత్తగా కన్పిస్తున్నాయి. కేకేఆర్‌ కెప్టెన్‌గా భారత స్టార్‌ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ ఎంపికైన సంగతి తెలిసిం‍దే. అదే విధంగా ఐపీఎల్‌ మెగా వేలంలో ఇరు జట్లు స్టార్‌ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ ఏ రేంజ్‌లో జరగబోతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.