మీరు కోటి రూపాయలు సంపాదించాలంటే ఏం చెయ్యాలి? బాగా కష్ట పడాలి. వ్యాపారం చెయ్యాలి. వీలైతే మోసం కూడా చేసే దమ్మూ ధైర్యం ఉండాలి. ఎలాగైనా కోటి రూపాయలు సంపాదించాలంటే ఏ పని చేసేదానికైనా సిద్ధంగా ఉండాలి. అలాగని హత్యలు, దోపిడీలు చేస్తే కోటి సంగతి దేవుడెరుగు జైలుకు వెళ్లడం ఖాయం. మరి కోటి సంపాదించాలంటే ఎలా? ప్రస్తుతానికి కౌన్ బనేగా కరోడ్‌పతి టీవీ క్విజ్‌లో పాల్గొనడం తప్ప మరో మార్గం లేదు. అంటే మీకు తెలివితేటలు దండిగా ఉండాలన్నమాట!
View this post on Instagram
ఇప్పటికే ఎంతోమందిని కోటీశ్వరులను చేసిన ఈ ప్రోగ్రామంలో తాజా ఓ మహిళా ఐపీఎస్ అధికారి కోటి రూపాయలు గెల్చుకున్నారు. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న కేబీసీ ప్రోగ్రాం ప్రస్తుత 12వ సీజన్ తొలిసారిగా నజియా నసీమ్ అనే మహిళ కోటి కొల్లగొట్టారు. ఐపీఎస్ ఆఫీసర్ మోహితా శర్మ కూడా కోటి సంపాదించారు. అంతే కాకుండా 7 కోట్లు గెల్చుకునే జాక పాట్ ప్రశ్నకు కూడా చేరుకున్నారు. ఆ ప్రశ్నకు మోహిత జవాబిచ్చిందో లేదో తెలుసుకోవాలంటే ఈ నెల 17న ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే. దీని ప్రోమోను నిర్వాహకులు మీడియాకు విడుదల చేశారు. తను ఎంత గెల్చుకున్నా వచ్చిన సొమ్ముతో తృప్తి పడి హాయిగా నిద్రపోతానని మోహిత సరదాగా సమాధానం ఇచ్చారు.
2017 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మోహత జమ్మూకశ్మీర్‌లోని బారీ బ్రహ్మణలో పనిచేస్తున్నారు. ఆమె ఐఎఫ్ఎస్ అధికారిని పెళ్లి చేసుకున్నారు. పోలీసులు విధులతోపాటు ఇంట్లో వంట చేయడం, పాటలు పాడటం ఆమెకు ఇష్టం. తరచూ విహారయాత్రలకు కూడా వెళ్తుంటారు.