పోలీస్ పెద్ద సార్లూ...ఆ యాడ్స్ మస్ట్ గా చూడండి..లేదంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

పోలీస్ పెద్ద సార్లూ…ఆ యాడ్స్ మస్ట్ గా చూడండి..లేదంటే..

July 6, 2017

అరెరే పోలీస్ పెద్దసార్లకు ఎంత కష్టం వచ్చింది. దాచుకుంటే దాగనంత..పోనీలే అనుకంటే కడపు ఉబ్బిపోయేలా..పక్క డిపార్ట్ మెంట్ వాళ్లకన్నా ఆ కష్టం రావొచ్చు అనుకునేలా..రాకూడనిది మాకే ఎందుకు వచ్చింది అనుకునేలా..డిపార్ట్ మెంట్ లో హల్ చల్ చేసే అలాంటోళ్లకు ఏం కష్టం వచ్చిందనుకుంటున్నారా…?చెప్పుకోలేని కష్టమేమి కాదు..కాకపోతే కాస్తా తగ్గించుకోవాలి..? ఇంతకీ ఎంది అది అంటే…

ఎంతో కష్టపడి చదివితేనే గానీ సివిల్స్ రాదు.అందులో ఐపీఎస్ అంటే ఇంకా ఎక్కువే.ర్యాంకు వస్తేనే కాదు ఫిట్ నెస్ కంపల్సరీ..ట్రైనింగ్ పూర్తయి పోస్టింగ్ చేతికి వచ్చేదాకా ఫిట్ నెట్ మస్ట్..ఆ తర్వాత పొట్ట ఎంత పెంచినా ఏం కాదు. అందుకే ఐపీఎస్ లో ఎక్కువ మందికి ఫిటెనెస్ ఉండదు..పొట్ట విషయంలో..బానెడు పొట్టలేసుకుని ఆర్డరేస్తుంటారు.ఇన్నాళ్లూ వోకే…ఇక ముందు అలాగే ఉంటామంటే కుదరదు. ఫిట్ నెస్ మస్ట్ గా ఉండితీరాలి. లేదంటే ప్రమోషన్ కే ఎసరు. ఈ రూల్ త్వరలో రాబోతోంది.

పోలీస్ పెద్ద సార్లూ..టీవీలు చూసేటప్పుడు బరువు యాడ్ లు వస్తే మునపటిలా మార్చకండి..ఎలా తగ్గించుకోవాలో చూడండి. బరువు తగ్గించుకునేహెల్త్ టిప్స్ పట్టించుకోండి. ఆర్డర్లు తో పరుగులు పెట్టించడం కాదు..మీరూ పరుగులు తీయండి..లేదంటే నో ప్రమోషన్.

భారీగా బరువు పెరిగి, బాన పొట్టలుపెంచే ఐపీఎస్ లకు ప్రమోషన్లు ఇవ్వొద్దని కేంద్రం కొత్త రూల్ తీసుకురాబోతోంది హోంశాఖ సిఫారసు మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం,అదే డీవోపీటీ సర్వీస్‌ రూల్స్‌ను సవరించి.. ముసాయిదాను రెడీ చేసింది.కేంద్రం ఆమోద ముద్రే తరువాయి, ఫిట్ నెస్ తో పాటు ప్రతి ఐపీఎస్‌ అధికారి ఇంటెలిజెన్స్‌, ఆర్థిక నేరాలు, సైబర్‌ నేరాలు, వీఐపీ సెక్యూరిటీ, పారిశ్రామిక భద్రత, ఉగ్రవాద నియంత్రణ, కౌంటర్‌ ఇన్‌సర్జెన్సీ లాంటి 20 కీలక విభాగాల్లో కనీసం మూడింటిపై పూర్తిగా పట్టు సాధించాలని ప్రతిపాదించారు. డీఐజీ, ఐజీ, అదనపు డీజీగా ప్రమోషన్‌ పొందే ముందు కేంద్రం వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తుంది.

మొత్తానికి కొత్త రూల్ సూపర్. సో పోలీస్ పెద్దసార్లూ..ఇక పరుగో పరుగు..రన్ రాజా రన్..తప్పదు ఫిట్ నెస్ కోసం..