iQOO ఇటీవల తన కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO 11 5Gని విడుదల చేసింది, ఇది ఒక ఫ్లాగ్షిప్ డివైజ్. ఈ స్మార్ట్‌ఫోన్ జనవరి 13 నుంచి ఆన్ లైన్ ద్వారా సేల్స్ ప్రారంభించింది. వినియోగదారులు ఈ హ్యాండ్‌సెట్‌ను అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. దీని సేల్ జనవరి 13 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. హ్యాండ్సెట్ 2K రిజల్యూషన్‌తో AMOLED డిస్ప్లేను కలిగి ఉన్నాయి.
ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, దీని ప్రధాన లెన్స్ 50మెగాపిక్సెల్. స్మార్ట్‌ఫోన్‌కు పవర్ సపోర్ట్ ఇవ్వడానికి, 5000ఎంఏహెచ్ బ్యాటరీ అందించబడింది, ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్లో అందుబాటులో ఉన్న ఆఫర్లు తెలుసుకుందాం.
ఆఫర్ ఇదే..
iQOO 11 5జి రెండు కాన్ఫిగరేషన్లు, రెండు కలర్ ఆప్షన్లలో వస్తోంది. దీని బేస్ వేరియంట్ 8GB RAM + 256జిబి స్టోరేజ్‌తో వస్తుంది, దీని ధర రూ. 59,999. అయితే, టాప్ వేరియంట్ 16జిబి RAM + 256బిజి స్టోరేజీతో వస్తుంది, దీని ధర రూ.64,999. HDFC, ICICI బ్యాంక్ కార్డ్‌లపై హ్యాండ్సెట్లపై రూ.1000 తగ్గింపు పొందవచ్చు. రూ. 5000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
Amazon నుండి ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. E-కామర్స్ వెబ్సైట్లో కూపన్ ద్వారా రూ.1000 తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా రూ. 3000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంటుంది. మీరు ఆల్ఫా , లెజెండ్ కలర్ ఆప్షన్లలో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
స్పెసిఫికేషన్లు :
స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఫన్‌టచ్ 13లో పనిచేస్తుంది. ఇది 6.78-అంగుళాల 2K E6 AMOLED డిస్ప్లేను పొందుతుంది, ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 16GB RAM ఎంపికను, 256జిబి స్టోరేజీ ను కలిగి ఉంది.
iQOO 11 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, దీని ప్రధాన లెన్స్ 50మెగాపిక్సెల్, ఇది OIS మద్దతుతో వస్తుంది. ఇది కాకుండా, వినియోగదారులు 13మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అందుబాటులో ఉంది. ముందు భాగంలో, కంపెనీ 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించింది. ఫోన్‌కు శక్తినివ్వడానికి, 5000ఎంఏహెచ్ బ్యాటరీ అందించబడింది, ఇది 120W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.