మరో 5జీ ఫోన్ వచ్చేసింది.. జియో యూజర్లకు పండగే - MicTv.in - Telugu News
mictv telugu

మరో 5జీ ఫోన్ వచ్చేసింది.. జియో యూజర్లకు పండగే

February 25, 2020

iQoo 3

రియల్‌మి ఎక్స్50 ప్రో 5జీ ఫోన్ వచ్చి ఒక రోజైనా గడవక ముందే మన దేశానికి మరో 5జీ ఫోన్ వచ్చేసింది. వివో సబ్ బ్రాండ్ అయిన iQoo తన మొదటి ఫోన్‌ను విడుదల చేసింది. దీంతో అది మార్కెట్లోకి రావడం రావడమే 5జీ ఫోన్‌తో రావడం విశేషంగా మారింది. iQoo 3 పేరిట లాంచ్ అయిన ఈ ఫోన్‌లో 5జీతో పాటు 4జీ, 3జీ వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 5జీ కావాలనుకుంటే హైఎండ్ వేరియంట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

 

4జీ వేరియంట్ రూ.36,990కు లభిస్తోంది. ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఫీచర్స్ ఉన్నాయి. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో 4జీ ధర రూ.39,990గా ఉంది. ఇదిలావుండగా హైఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే 5జీ అందుబాటులో ఉంది. దీని ధర రూ.44,990గా లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్లు మూడు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. క్వాంటం సిల్వర్, వొల్కానో ఆరెంజ్, టొర్నాడో బ్లాక్ రంగుల్లో ఉన్నాయి. అయితే ఈ ఫోన్ అమ్మకాలు ఫ్లిప్ కార్ట్, iQoo.com వెబ్‌సైట్లలో మార్చి 4 మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌పై లాంచ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.3,000 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. అలాగే జియో యూజర్లకు మాత్రం ఏకంగా రూ.12 వేల విలువైన లాభాలను ఈ ఫోన్ కొనుగోలు ద్వారా అందించనున్నారు. 

 

iQoo 3 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఇలా.. 

-6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే

-స్క్రీన్ టు బాడీ రేషియో 91.4 శాతం

-స్క్రీన్ రక్షణ కోసం Schott Xensation UP protective layer 

-180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఫీచర్

-పంచ్ హోల్ కెమెరా సెటప్

-స్క్రీన్ రిజల్యూషన్ 1080×2400 పిక్సెల్స్ 

-క్వాల్ కాం తాజాగా లాంచ్ చేసిన స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ (5జీని సపోర్ట్ చేసేలా ఈ ప్రాసెసర్‌ను రూపొందించారు)

-ప్రైమరీ క్లాక్ స్పీడ్ 2.8 గిగా హెర్ట్జ్ 

-వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్

(వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగా పిక్సెల్ సామర్థ్యం ఉన్న సోనీ ఐఎంఎక్స్582 సెన్సార్‌ను అందించారు. దీంతో పాటు 13 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 13 మెగా పిక్సెల్ టెలిఫొటో సెన్సార్, 2 మెగా పిక్సెల్ పొర్ ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. ముందువైపు ఉన్న హోల్ పంచ్ లో 16 మెగా పిక్సెల్ సామర్థ్యం ఉన్న కెమెరాను సెల్ఫీ కెమెరాగా అందించారు)

-4కే వీడియో రికార్డింగ్

-55W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ

-బ్యాటరీ సామర్థ్యం 4,440 ఎంఏహెచ్

-ఆండ్రాయిడ్ 10 ఆధారిత iQoo యూఐ 1.0 ఆపరేటింగ్ సిస్టం

-5జీ, 4జీ, వైఫై, బ్లూటూత్ వెర్షన్ 5.1, యూఎస్ బీ టైప్-సీ 2.0, గ్లోనాస్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ వంటి ఫీచర్లను అందించారు.