Ira Khan And Boyfriend Nupur Shikhare Got Engaged In The Filmiest Fashion
mictv telugu

అమీర్ ఖాన్ కూతురి నిశ్చితార్థం.. అతనితోనే.. వీడియో వైరల్

September 23, 2022

ఈ మధ్య తండ్రితో కలసి బికినీలో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకొని వైరల్ అయింది బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరాఖాన్. ఆ సమయంలో నెటిజన్స్ ఎన్ని ట్రోల్స్ చేసినా అవేవీ పట్టించుకోకుండా.. తెగ హడావిడి చేసి నెటిజన్లకు, మీడియాకి కావాల్సినంత స్టఫ్ ఇచ్చింది. తాజాగా మరోసారి ఐరాఖాన్ వైరల్ గా మారింది.

ఐరాఖాన్ గత రెండేళ్లుగా తన ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారే తో డేటింగ్ చేస్తుంది. గతంలో కూడా వీళ్లిద్దరు పార్టీలకి, పబ్బులకి తిరుగుతూ మీడియా కంట పడ్డారు. వీరిద్దరూ కలిసి ఓ వీడియోని అధికారికంగా పోస్ట్ చేశారు. తాజాగా ఓ సైక్లింగ్ ఈవెంట్లో ప్రియుడు నుపుర్ శిఖారే తో తాజాగా నిశ్చితార్థం చేసుకుంది. ఇటలీలో జరిగిన ఈవెంట్‌లో నుపుర్ వచ్చి సడెన్‌గా ఐరాకు ప్రపోజ్ చేయగా.. ఆమె అంగీకరించింది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన వీడియోను ఐరా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నుపుర్.. ఐరాఖాన్ దగ్గరికివచ్చి మోకాళ్ళ మీద కూర్చొని రింగ్ ఇచ్చి పెళ్లి చేసుకుందామా అని అడగడంతో ఓకే అని చెప్పి రింగ్ పెట్టించుకుంది ఐరా. ఆ తర్వాత ఇద్దరూ అందరూ చూస్తుండగానే లిప్ కిస్ ఇచ్చుకున్నారు. ఇక ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో నుపుర్, ఐరాఖాన్ ఇద్దరూ కలిసి అధికారికంగా ఈ వీడియోని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇదే మా నిశితార్థం అన్నట్టు అందరికి తెలిపారు. ఒకరికొకరు ఎస్ చెప్పుకున్నట్టు పోస్ట్ చేశారు. దీంతో బాలీవుడ్ ప్రముఖులు, వారి స్నేహితులు సోషల్ మీడియా వేదికగా వీరికి కంగ్రాట్స్ చెప్తున్నారు. దీనిపై అమీర్ ఖాన్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి.