కరీబియన్ లో ఇర్మా బీభత్సం - MicTv.in - Telugu News
mictv telugu

కరీబియన్ లో ఇర్మా బీభత్సం

September 6, 2017

చరిత్రలోనే అత్యంత భయంకర తుపానుగా పేర్కొంటున్న ఇర్మా హరికేన్ అమెరికాతోపాటు అట్లాంటిక్ తీర దేశాలను వణికిస్తోంది. బుధవారం తీరం దాటిని తుపాను కరీబియన్ దీవుల్లో భారీ విధ్వసం సృష్టించింది. సెయింట్ మార్టిన్ లోని నాలుగు బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం అయ్యాయి. కుండపోత వర్షాలతో పలు ప్రాంతాలు వరద నీట మునిగాయి. పారిస్ కు, సెయింట్ మార్టిన్ మధ్య కమ్యూనికేషన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. గంటకు 300 కి.మీ వేగంతో భయంకరమైన పెనుగాలులు వీస్తున్నాయి. ఇర్మా.. సెయింట్ మార్టిన్ పై ప్రతాపం చూపకముందు .. అంటిగువా,, బార్బుడాల్లో బీభత్సం సృష్టించింది. తుపాను పుయెర్టో రికో, డొమినికన్ రిపబ్లిక్ దేశాల వైపు కదులుతోంది. అమెరికాలోని ఫ్లోరిడా కీ వెస్ట్ ఏరియా ప్రాంతం నుంచి ముందుజాగ్రత్తగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను నేపథ్యంలో పలు దేశాల్లో విమాన సర్వీసులను రద్దు చేశారు.