Iran hangs three womens
mictv telugu

ముగ్గురు మహిళలను ఉరి తీసిన ఇరాన్.. గృహ హింసే కారణం

July 30, 2022

ఇస్లాంను అనుసరించే ఇరాన్ దేశం ముగ్గురు మహిళలను ఉరి తీసింది. ఈ నెల 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ వీరు చేసిన నేరం ఏంటంటే.. ముగ్గురూ వారి భర్తలను చంపేశారు. ఇరాన్‌లో మహిళలకు హక్కులుండవు. హక్కుల కోసం, మరణ శిక్షను రద్దు కోసం అంతర్జాతీయ మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే మహిళలకు పెళ్లిళ్లు కావడం, చట్టపరమైన హక్కులు లేకపోవడం అక్కడి మహిళలకు శాపంగా మారాయి. పెళ్లయ్యాక గృహ హింస ఎదుర్కొన్నప్పటికీ, విడాకులు తీసుకునే అవకాశం లేకపోవడం బాధిత మహిళలు అక్కడ పెద్ద ఎత్తున భర్తలను హత్య చేస్తున్నారు. మహిళలకు ఉరి శిక్ష ఎక్కువగా భర్తలను చంపిన ఘటనలోనే విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమాజంలో సమతూకం ఉండాలని, మహిళలకు రక్షణ కల్పించాలని అంతర్జాతీయ సమాజం డిమాండ్ చేస్తోంది. అయినా ఇరాన్ ఇవేవీ పట్టించుకోకుండా తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని వారు మండిపడుతున్నారు.