Iran is passed away donkeys on its borders
mictv telugu

పాక్ – ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున గాడిదలను చంపుతున్న ఇరాన్

February 22, 2023

Iran is passed away donkeys on its borders

షియా మెజారిటీ దేశంగా ఉన్న ఇరాన్ పక్క దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో వందల సంఖ్యలో గాడిదలను చంపేస్తోంది. సీస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని కాలీగాన్‌లలో గాడిదలను హతమార్చినట్టు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 14న వీడియో తీసినట్టు చెప్తున్నారు. దాదాపు 1100 పొడవైన సరిహద్దు ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉండడంతో చమురును అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇందుకోసం గాడిదలను వినియోగిస్తుంటారు. సరిహద్దులు దాటిన వెంటనే గాడిదలను అక్కడే వదిలేస్తే ఆ తర్వాత వాటిని మళ్లీ చమురు అక్రమ రవాణా కోసం ఓ ముఠా ప్రత్యేకంగా పనిచేస్తోంది.

ఈ అక్రమ రవాణాను నివారించేందుకు ఇరాన్ భద్రతా బలగాలు గాడిదలను టార్గెట్ చేస్తున్నాయి. దీనిపై ఇరాన్ పార్లమెంటులో సోషల్ కమిషన్ సభ్యుడు షాకూపుర్ హుస్సేన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గాడిదలను చంపే బదులు యజమానులను అరెస్ట చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ప్రతిపాదనను కుర్దిస్తాన్ స్టేట్ సరిహద్దు దళ కమాండర్ తోసిపుచ్చారు. రవాణా సాధనాలు అందుబాటులో లేకపోతే చమురు అక్రమ రవాణా దానంతట అదే తగ్గుతుందని స్పష్టం చేశారు.