అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు షాక్..అరెస్ట్ వారెంట్ జారీ! - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు షాక్..అరెస్ట్ వారెంట్ జారీ!

June 29, 2020

arrest

అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇరాన్ అగ్రశ్రేణి జనరల్ సులేమానిని మరణించిన సంగతి తెల్సిందే. ఈ దాడిలో అమెరికా అధ్యక్షుడితో పాటు మరికొంత మంది ఉన్నారని, వారిని అదుపులోకి తీసుకోవడానికి ఇరాన్ ఇంటర్పోల్ సహాయం కోరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఇరాన్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ఈ ఏడాది జనవరి 3న జనరల్ కస్సేమ్ సులేమానిపై చేసిన దాడిలో ట్రంప్ తో పాటు మరో 30 మందికి పైగా ప్రమేయం ఉందని ఇరాన్-టెహ్రాన్ ప్రాసిక్యూటర్ అలీ అల్కాసిమెహర్ వెల్లడించారు. ఈ మేరకు ఇరాన్ సెమీ-అధికారిక ఇస్నా వార్తా సంస్థ సోమవారం ప్రకటించింది. కాగా, ఇరాన్ పెట్టుకున్న అభ్యర్థనకు ఇంటర్‌పోల్ స్పందించలేదు. ట్రంప్ తో సహా ఇతరులకు ఇరాన్ “రెడ్ నోటీసు” ఇవ్వమని కోరినట్లు ఇంటర్ పోల్ ప్రతినిధి అలీ అల్ఖాసిమెర్ వెల్లడించారు.