కరోనా వైరస్ బారిన పడ్డ ఇరాన్‌ ఆరోగ్య మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా వైరస్ బారిన పడ్డ ఇరాన్‌ ఆరోగ్య మంత్రి

February 26, 2020

xcbcb

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 80 వేలకుపైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 2700 మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారు. కాగా ఈ ప్రమాదకర వైరస్ ఇటలీ మీదుగా యూరప్ దేశాలకూ వ్యాపిస్తోంది. కరోనా వైరస్ తాజాగా ఇరాన్‌ దేశానికి పాకింది. ఈ వైరస్ కారణంగా ఇరాన్‌లో 95 కేసులు నమోదయ్యాయి. వారిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ డిప్యూటీ హెల్త్ మినిస్టర్‌ ఇరాజ్ హరిర్చికు కూడా కరోనా వైరస్ సోకింది.

‘నాకు కరోనా ఇన్ఫెక్షన్ సోకింది. కానీ వైరస్‌ను తప్పకుండా ఓడిస్తాననే నమ్మకం ఉంది’ అని మీడియాతో హరిర్చి తెలిపారు. ఇరాన్ మీదుగా కరోనా వైరస్ ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఒమన్, అప్ఘానిస్థాన్ తదితర దేశాలకు వైరస్ విస్తరిస్తోంది. యూఏఈ, కెనడా, లెబనాన్ లాంటి దేశాలు కూడా కరోనా కేసులు ఇరాన్ నుంచే వచ్చాయని ఆరోపిస్తున్నాయి. కరోనా భయం కారణంగా ఇరాన్ పొరుగు దేశాలైన టర్కీ, ఆర్మేనియా, పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ సరిహద్దులను మూసేశాయి. బహ్రెయిన్, ఒమన్, జోర్డాన్, సౌదీ, యూఏఈలు ఇరాన్‌కు విమాన సర్వీసులను నిలిపేశాయి. చైనాతో గట్టి వాణిజ్య సంబంధాలున్న ఇరాన్.. ఆ దేశం నుంచి రాకపోకలను మాత్రం నిలిపేయలేదు.