Iraq clashes erupt after Muqtada al-Sadr quits
mictv telugu

షియాల గొడవల్లో భారీ ప్రాణనష్టం.. ఇరాక్‌లో టెన్షన్

August 30, 2022

Iraq clashes erupt after Muqtada al-Sadr quits

పశ్చిమాసియా దేశం ఇరాక్ అల్లర్లు, హత్యాకాండలతో అట్టుడుకుతోంది. భారీ ప్రాణనష్టం జరుగుతోంది. షియాలకు చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో ఇప్పటి వరకు 30 మంది బలికాగా, 300 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

షియాల నాయకుడు ముక్తదా అల్‌ సదర్‌ అనుచరులు దేశ రాజధాని బాగ్దాద్‌లోని అధ్యక్ష భవనంలో చొరబడ్డారు. అక్కడ విధ్వంసాన్ని సృష్టించబోగా భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. తాను మంగళవారం నుంచి రాజకీయాల నుంచి తప్పుకుంటానని ముక్తదా ప్రకటించడంతో ఆయన అనుచరులు ఆగ్రహోదగ్రులయ్యారు బాగ్దాద్‌లో పటిష్ట రక్షణ ఉండే ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. రాకెట్లు కూడా విసిరినట్లు వార్తలు వస్తున్నాయి. చెదరగొట్టడానికి పోలీసులు రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయువు ప్రయోగించారు. బాంబులు కూడా వేశారు. ముందు జాగ్రత్తగా పొరుగుదేశం ఇరాన్ తన సరిహద్దులను మూసేసింది. ముక్తదా అల్ సదర్ వర్గానికీ , మాజీ ప్రధాని నౌరీ అల్ మాలికీ వర్గానికి మధ్య కొన్నేళ్లుగా గొడవలు సాగుతున్నాయి. నౌరీకి ఇరాన్ మద్దతు ఉందని ప్రచారం.