IRCTC shares surge on data monetisation buzz. Company issues clarification
mictv telugu

ప్రయాణికుల డేటాతో ఐఆర్‌సీటీసీ 1000 కోట్ల వ్యాపారం.. ప్రైవసీకి భంగం!

August 19, 2022

IRCTC shares surge on data monetisation buzz. Company issues clarification

టికెట్ల కోసం రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికుల వివరాలతో కూడిన డిజిటల్‌ డేటాను ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(IRCTC) మానిటైజ్‌ చేయాలని భావిస్తోంది. ఆ డేటాతో ప్రభుత్వ, ప్రైవేటురంగ కంపెనీలతో వ్యాపారం చేసి.. దాదాపు రూ.1000 కోట్ల ఆదాయం రాబట్టవచ్చని అంచనా వేస్తోంది. దీని వల్ల ఎక్‌స్ట్రా ఇన్‌కమ్‌తోపాటు కస్టమర్లకు సర్వీసులను మరింత మెరుగుపరచవచ్చని చెబుతోంది. ఇందుకోసం ఓ కన్సెల్టెంట్‌ను నియమించుకునేందుకు తాజాగా టెండర్‌ను కూడా ఆహ్వానించింది. కస్టమర్/వెండర్ అప్లికేషన్ల డేటాను మానిటైజ్‌ చేయాలనుకుంటున్నట్లు తన టెండర్‌ నోటీసులో పేర్కొంది. ఈ డేటాతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్న టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌, హోటల్స్‌, ఫైనాన్సింగ్‌, ఇన్సూరెన్స్‌, వైద్య సంస్థలతో వ్యాపారం చేయనున్నట్లు ఐఆర్‌సీటీసీ పేర్కొంది. ఉదాహరణకు ఏదైనా క్యాబ్‌ బుకింగ్‌ సంస్థలతో ఈ డేటాను షేర్ చేస్తే.. ఆయా సంస్థలు ప్రయాణికులకు తమ క్యాబ్‌ను బుక్‌ చేసుకోవాలని నోటిఫికేషన్‌ పంపించే అవకాశం ఉంటుంది.

ఇలా డేటా థర్డ్ పార్టీకి చెందిన సంస్థలకు షేర్ అవ్వడంతో.. కస్టమర్ల ప్రైవసీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది పర్సనల్ ప్రైవసీని ఉల్లంఘించడమే అవుతుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఇన్నేళ్లుగా ఐఆర్‌సీటీసీ వద్ద పెద్ద మొత్తంలో ప్రయాణికుల వివరాలు ఉన్నా.. వాటిని దుర్వినియోగం చేసిన దాఖలాలు లేవు. ఒకసారి మానిటైజ్‌ పేరుతో డేటా మొత్తం థర్డ్‌ పార్టీ చేతికెళ్తే దుర్వినియోగం అవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇంటర్నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌ (IFF) సైతం తాజాగా ఆందోళన వ్యక్తంచేసింది. గతంలో వాహన్‌ డేటా బేస్‌లో ఉన్న రిజిస్ట్రేషన్‌ వివరాలను దిల్లీలో లక్షిత దాడులకు వినియోగించిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. వాణిజ్య ప్రయోజనాల కంటే ముందు పౌరుల హక్కులకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని ఈ సందర్భంగా సూచించింది. కానీ ఐఆర్‌సీటీసీ మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.