లాక్ డౌన్ 30 వరకు..ఐఆర్సీసీటీ సంకేతం! - MicTv.in - Telugu News
mictv telugu

లాక్ డౌన్ 30 వరకు..ఐఆర్సీసీటీ సంకేతం!

April 7, 2020

IRCTC suspends bookings till 30 April

లాక్ డౌన్ జూన్ 3 వరకు పొడిగించే అవకాశం ఉందని నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డ సంగతి తెల్సిందే. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశానని సీఎం కేసీఆర్ తెలిపారు. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లాక్ డౌన్ పొడిగించడంపై సుముఖత తెలిపినట్టు తెల్సింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 

కానీ, కేంద్రం మాత్రం లాక్ డౌన్ పొడగింపుపై ఎలాంటి ఆలోచన లేదని పదే పదే తెలుపుతోంది. అయితే లాక్ డౌన్ పొడగింపుపై భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ సంకేతం ఇచ్చింది. రైల్వే టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ఏప్రిల్ 30 వరకూ రద్దు చేస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. దీంతో ఈ నెలాఖరు వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన తెరపైకి వచ్చింది.