Ireland bowler briyan littel hatrick vs nz
mictv telugu

కివీస్‌పై ఐర్లాండ్ బౌలర్ హ్యాట్రిక్

November 4, 2022

టీ20 ప్రపంచ కప్‌లో ఐర్లాండ్ బౌలర్ ‘లిటిల్ ’ అదరగొట్టాడు. సూపర్- 12లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు. 19వ ఓవర్లో కేన్ విలియమ్సన్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్‌లను ఔట్ చేసాడు లిటిల్. ఐతే అప్పటికే భారీ స్కోర్ సాధించిన న్యూజిలాండ్‌ జోరుకు కొంత మేర అడ్డుకట్ట వేశాడు.

టాస్ ఓడి, మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (35 బంతుల్లో 61) మెరుపు అర్ధ శతకంతో రాణించాడు. ఓపెనర్లు ఫిన్ అలెన్ (18 బంతుల్లో 32), డెవాన్ కాన్వే (28), డారిల్ మిచెల్ (31 నాటౌట్)తో సత్తా చాటారు. ఓ దశలో న్యూజిలాండ్ సులువుగా 200 స్కోరు చేసేలా కనిపించింది. చివర్లో లిటిల్ విజృంభించి కివీస్ జోరుకు అడ్డుకట్ట వేసాడు. గ్రూప్-1 లో న్యూజిలాండ్ ప్రస్తుతం 5 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సెమీస్‌కు చేరుకుంటుంది.