సినిమాల్లోకి మాజీ క్రికెటర్.. విలన్ క్యారెక్టర్‌లో.. - MicTv.in - Telugu News
mictv telugu

సినిమాల్లోకి మాజీ క్రికెటర్.. విలన్ క్యారెక్టర్‌లో..

October 28, 2020

టీం ఇండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన కెరీర్‌లో సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించారు. క్రికెట్‌ నుంచి సినిమాల్లోకి టర్న్ తీసుకున్నారు. రిటైర్మెట్ తర్వాత ఖాళీగా ఉంటున్న ఆయన సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ విలన్ పాత్ర పోషించేందుకు సిద్ధం అయ్యారు. తమిళ సినిమాకు ఓకే చెప్పడంతో పాటు దీనికి సంబంధించిన పోస్టర్ కూడా తాజాగా విడుదలైంది.  సౌత్ స్టార్ విక్రమ్ నటిస్తున్న కోబ్రా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇర్ఫాన్ పఠాన్ పుట్టిన రోజు కానుకగా అక్టోబర్ 27న దీన్ని విడుదల చేశారు.

కోబ్రా సినిమాలో అతడి పాత్రను పరిచయం చేస్తూ.. దర్శకుడు అజయ్‌ జ్ఞానముతు సర్‌ప్రైజ్ ఇచ్చాడు.  దీంట్లో అస్లాన్ ఇల్మాజ్ పాత్రలో అతడు కనిపించనున్నాడు. ‘హ్యాపీ బర్త్‌డే అస్లాన్‌ యిల్మాజ్‌’ అని పేర్కొనడంతో అతడి పాత్ర రివీల్ అయింది. స్టైలీష్ లుక్‌లో ఫ్రెంచ్‌ ఇంటర్‌ పోల్‌ ఆఫీసర్ అస్లాన్‌ యిల్మాజ్‌ పని చేయనున్నాడు. లాక్‌డౌన్ విధించడంతో షూటింగ్ వాయిదా పడింది. ఇటీవలో సడలింపులు రావడంతో మళ్లీ రష్యాలో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అవుతోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.