Irregularities of Smriti Irani's daughter..show cause notice issued
mictv telugu

 స్మృతి ఇరానీ కూతురు అక్రమాలు..షోకాజ్‌ నోటీసు జారీ

July 23, 2022

Irregularities of Smriti Irani's daughter..show cause notice issued

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేరు చిక్కుల్లో పడింది. ఆమె కుమార్తె జోయిష్‌ ఇరానీ చేసిన పనికి స్మృతి ఇరానీని వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జోయిష్‌ ఇరానీ చేసిన పని చట్టానికి విరుద్దమని, తీవ్రమైన ఆరోపణల రేకెత్తుతున్నాయి. ఇంతకి స్మృతి ఇరానీ కూతురు జోయిష్‌ ఇరానీ ఏం చేసింది? ఎందుకు స్మృతి ఇరానీ తొలగించాలి? అని కాంగ్రెస్ నేతలు డిమండ్ చేస్తున్నారో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..
ఉత్తర గోవాలోని అస్సగావ్‌లో హైక్లాస్‌ రెస్టారెంట్‌ను స్మృతి ఇరానీ కూతురు జోయిష్‌ ఇరానీ నడుపుతున్నారు. ఈ క్రమంలో బార్‌ లైసెన్స్‌ విషయంలో చనిపోయిన వ్యక్తి పేరుమీద రిన్యూవల్‌ చేయించుకోవడంపై.. గోవా ఎక్సైజ్‌ కమిషనర్‌ నారాయణ్‌ ఎం.గడ్‌ జోయిష్‌ ఇరానీకి చెందిన ‘సిల్లీ సోల్స్‌ కేఫ్‌ అండ్‌ బార్‌’కు సంబంధించి ఈనెల 21న షోకాజ్‌ నోటీసు జారీచేశారు. తప్పుడు పద్ధతుల్లో, నకిలీ పత్రాల ద్వారా ఆమె మద్యం లైసెన్స్‌ పొందారని న్యాయవాది ఏరిస్‌ రోడ్రిగ్స్‌ ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.

”లైసెన్స్‌దారు అంథోనీ దిగామా 2021 మే 17న మరణించినప్పటికీ అతడి పేరు మీదే గతనెల లైసెన్స్‌ పొడిగింపు పొందారు. అయినప్పటికీ అతడి పేరు మీదే గతనెల 22న దరఖాస్తు చేసుకొని రిన్యూవల్‌ పొందారు. దరఖాస్తుపై అతడికి బదులుగా మరొకరు సంతకం చేశారు. ఆరునెలల్లో లైసెన్స్‌ బదిలీ చేస్తామని కూడా ఎక్సైజ్‌ శాఖకు హామీ ఇచ్చింది. ఈ నోటీసుపై వచ్చే 29న విచారణ జరుగుతుంది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా ఈ వ్యవహారానికి సంబంధించిన పత్రాలను నేను పొందగలిగారు. కేంద్రమంత్రి కుటుంబ సభ్యులు పాల్పడిన ఈ మెగా మోసంపై లోతుగా దర్యాప్తు జరపాలి. ఇందులో ఎక్సైజ్‌ అధికారులు, అస్సగావ్‌ గ్రామపెద్దలు మిలాఖతయ్యారు. నిజానికి గోవాలో బార్‌ లైసెన్స్‌ ఇవ్వాలంటే ముందుగా రెస్టారెంట్‌ ఉండాలి. కానీ, రూల్స్‌ను బ్రేక్ చేసి, గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటికింకా రెస్టారెంట్‌ లైసెన్స్‌ పొందని సిల్లీ సోల్స్‌కు బార్‌ లైసెన్స్‌ కట్టబెట్టారు” అని న్యాయవాది ఏరిస్‌ రోడ్రిగ్స్‌ తెలిపారు.

అనంతరం ఆరోపణలపై.. జోయిష్ స్పందిస్తూ, వాటిని కొట్టిపడేశారు. అవన్ని నిరాధారమైన ఆరోపణలన్నారు. ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది కిరత్ నాగ్రా తన క్లయింట్‌పై వచ్చిన ఆరోపణలను ఖండించారు. మంత్రి స్మృతి ఇరానీ పరువు తీయాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రత్యర్థులు ఆమెపై ఇలాంటి ఆరోపణలు చేశారని చెప్పుకొచ్చారు.