నేను ఆయన్ను కోల్పోలేదు.. ఇర్భాన్ భార్య భావోద్వేగ పోస్టు
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ బుధవారం క్యాన్సర్‌తో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన భార్య సుతప సిక్దార్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. గురువారం తన భర్తతో దిగిన ఫొటోను పంచుకున్నారు. తన భర్త భుజాల మీద చేతులు వేసి కూర్చున్న ఈ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలన్నింటికీ ప్రోఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు. తన భర్త ఈ లోకాన్ని విడిచినప్పటికీ తనతోనే ఉన్నాడంటూ ఉద్వేగంతో షేర్ చేశారు. 'నేను కోల్పోలేదు.. అన్ని విధాలుగా కలిగి ఉన్నాను' అనే క్యాప్షన్‌ను జత చేశారు. ఆమె పోస్టుకు చాలామంది అభిమానులు స్పందిస్తున్నారు.
గొప్ప నటుడిడిన కోల్పోయిన చిత్ర పరిశ్రమ.. మంచి భర్తను కోల్పోయిన భార్య.. ధైర్యంగా ఉండండి అంటూ ఆమెకు ఆత్మస్థైర్యాన్ని అందిస్తున్నారు. కాగా, ఎడాదిగా అంతుచిక్కని క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇర్ఫాన్ ముంబైలోని కోకిలాబెన్ దీరుభాయి అంబాని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి నాలుగు రోజుల ముందు ఇర్ఫాన్ తల్లి చనిపోయారు. కరోనా, లాక్‌డౌన్, అనారోగ్యం కారణంగా ఆయన తల్లి అంత్యక్రియలకు వెళ్లలేకపోయారు. ఇర్ఫాన్ చనిపోయి ఒకరోజు గడవక ముందే మరో బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీకపూర్ మృతిచెందడం బాలీవుడ్‌ను విషాదంలో ముంచెత్తింది.