ముఖం దాచుకుని వెళ్లిపోయిన ఇర్ఫాన్.. ఎందుకంటే..  - MicTv.in - Telugu News
mictv telugu

ముఖం దాచుకుని వెళ్లిపోయిన ఇర్ఫాన్.. ఎందుకంటే.. 

September 14, 2019

 

 

View this post on Instagram

 

#irfankhan snapped as he arrives in Mumbai early morning #getwellsoon #instadaily #ManavManglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అకస్మాత్తుగా ముంబయి విమానాశ్రయంలో కనిపించేసరికి అభిమానులు ఎగబడ్డారు. ఫోన్లు తీసి సెల్ఫీలు తీసుకోవాలని ప్రయత్నించారు. కానీ, వాళ్లని నిరాకరించారు. తన ముఖం కనిపించకుండా తల కిందికి దించుకున్నారు. తలపై టోపీ వుండటంతో ఆయన ముఖం అస్పష్టంగా కనిపించింది. వీల్ చేర్‌లో వున్న ఆయన వెంట ఓ ముగ్గురు వున్నారు. వాళ్లు అభిమానులను దగ్గరికి రానీయకుండా అడ్డుకున్నారు. అక్కడినుంచి తొందరగా వెళ్లి కారులో కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆయన అలా ఎందుకు వెళ్లిపోయారు కారణాలు తెలియరాలేదు. ఆరోగ్య కారణాలతోనే ఇర్ఫాన్ తన ముఖాన్ని దాచుకున్నారని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

 ఇదిలావుండగా ఇర్ఫాన్ గతకొంతకాలంగా లండన్‌లో ఉంటూ.. క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది మార్చిలో తాను అనారోగ్యానికి గురైనట్టు.. అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు ఇర్ఫాన్‌ ప్రకటించారు. ప్రస్తుతం లండన్‌లో చికిత్స పొందుతున్నారు.