Home > Featured > రకుల్ మద్యం కొనిందా? అబ్బఛా..నిజమా? (వీడియో)

రకుల్ మద్యం కొనిందా? అబ్బఛా..నిజమా? (వీడియో)

Is Actress rakul preet singh buying alcohol? Video goes viral

లాక్ డౌన్ లోనూ మద్యం దుకాణాలను ఓపెన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెల్సిందే. దీంతో గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. మద్యంప్రియులు ఎగబడి మద్యం కొనుగోలు చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ వీడియోల్లో నటి రకుల్ ప్రీత్ సింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రకుల్ చేతిలో ఉన్న బాటిల్ చూసి ఆమె కూడా మద్యం కొనుగోలు చేసిందని ప్రచారం చేస్తున్నారు. ముంబైలోని బాంద్రాలో ఓ మెడికల్ షాప్ వద్ద రకుల్ మందులు కొనుగోలు చేసుకుని రోడ్డు దాటుతుండగా ఎవరో వీడియో తీశారు. ఆ వీడియోను వైరల్ భయ్యని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. రకుల్ మెడికల్ షాప్ లో మందులు కొనుగోలు చేసిందని తెలిపారు. అయినా కూడా కొందరు ఆకతాయిలు రకుల్ వైన్ షాప్‌కు వెళ్లి మందు కొనుగోలు చేసిందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై రకుల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 6 May 2020 9:08 AM GMT
Tags:    
Next Story
Share it
Top