Is Ashwin Reason Behind Pakistan Out From T20 World Cup
mictv telugu

అశ్విన్ అన్న నువ్వు రియల్ హీరో.. పాకిస్తాన్ ని మరోసారి ఓడించి మట్టికరిపించావ్

October 31, 2022

రవించంద్రన్ అశ్విన్.. కుంబ్లే, హర్భజన్ తరువాత టీమిండియాకు దొరికిన గొప్ప స్పిన్నర్. అయితే డ్రెస్సింగ్ లో రూమ్ లో అశ్విన్ కి మరో పేరు ఉంది, అదే సైన్టిస్ట్ అని. టీమిండియా ప్లేయర్స్ అందరు అశ్విన్ ని శాస్త్రవేత్తగా పొగుడుతారు. క్రికెట్ పై అతని మేధస్సు చాలా గొప్పది అంటారు. ధోనిలో ఉండే సమయస్ఫూర్తి కూడా అశ్విన్ లో కనిపిస్తాయి అంటారు. దీనికి ఉదాహరణే మొన్న పాకిస్తాన్ తో జరిగిన టీ20 మ్యాచ్. ఒక బంతిలో రెండు పరుగులు చేయాల్సిన సమయంలో క్రీజ్ లోకి వచ్చిన అశ్విన్ తన తెలివితే మ్యాజిక్ చేసి భారత్ కి విజయాన్ని అందించాడు. తీవ్ర ఉత్కంఠత మధ్య తాను ఆడిన తోలి బంతిని వదిలేయడంతో వైడ్ రూపంలో అదనపు పరుగు భారత్ కి లభించేలా చేశాడు. అప్పుడు అశ్విన్ సమయస్ఫూర్తిని పొగుడుతూ పాకిస్తాన్ ని ట్రోల్ చేశారు ఫాన్స్.

 

అయితే మరోసారో అశ్విన్ పాకిస్తాన్ ఓటమికి కారణమయ్యాడు. సెమీస్ చేరకుండానే పాకిస్తాన్ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడానికి రెడీ అయిపోగా.. ఇది కూడా అశ్విన్ క్రెడిట్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. సౌత్ ఆఫ్రికాతో జరిగిన నిన్నటి మ్యాచ్ లో ఆఖరి వరకు పోరాడి ఓడింది భారత్. అయితే భారత్ సునాయాసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్.. అశ్విన్ ఎక్కువ పరుగులు ఇవ్వటంతో సౌత్ ఆఫ్రికా గెలుపొందింది. కోహ్లీ సైతం ఈజీ క్యాచ్ డ్రాప్ చేశాడు. దాంతో సౌత్ ఆఫ్రికా గెలవటంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. ఈ నేపథ్యంలో అశ్విన్ తన చెత్త బౌలింగ్ తో.. సౌత్ ఆఫ్రికాని గెలిపించి పాకిస్తాన్ వరల్డ్ కప్ నుండి నిష్క్రమించేలా చేశాడు.. అశ్విన్ నిజమైన సైన్టిస్, ఒక మేధావి, రియల్ హీరో అంటూ పాకిస్తాన్ కి కాలేలా ఇండియన్ ఫాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

 

ఇక పాక్‌కు టెక్నికల్‌గా ఇప్పటికీ సెమీస్ చేరే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ జట్టు టాప్-4లో నిలవడం దాదాపుగా కష్టమే. పాక్ చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినప్పటికీ.. భారత్, దక్షిణాఫ్రికా జట్లు చిత్తుగా ఓడితే తప్పితే పాకిస్థాన్ సెమీస్ చేరలేదు. సెమీస్ రేసులో సౌతాఫ్రికా ముందంజలో ఉండగా.. భారత్ తర్వాతి స్థానంలో ఉంది. దీంతో అశ్విన్ పాక్‌పై లాస్ట్ బాల్‌ను వైడ్‌గా వదిలేసిన ఫొటోను ట్వీట్ చేసి… అశ్విన్ తమను ఒకసారే ఓడించాడని పాక్ ఫ్యాన్స్ భావించారు. కానీ అశ్విన్ అన్న రెండోసారి పాక్‌ను ఓడించాడంటూ సెటైర్లు వేస్తున్నారు.