is balakrishna afraid of vijayashanthi in allu sirish questions at Urvasivo Rakshasivo pre release event
mictv telugu

భయమంటే తెలియని బాలయ్య.. విజయశాంతికి బెదిరిపోయాడా.. అల్లు ఫంక్షన్ లో సరికొత్త సీన్

October 31, 2022

90sలో బాలకృష్ణ విజయశాంతిల కాంబినేషన్ ఒక సెన్సేషన్. వీరు చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్సే. ఒకరకంగా బాలకృష్ణతో వరుస సినిమాలు చేయటంతోనే విజయశాంతికి స్టార్ స్టేటస్ వచ్చిందంటారు. అప్పట్లో వీరిద్దరి రిలేషన్ పై కూడా తెగ రూమర్స్ కూడా ఉండేవి. అయితే స్టార్ట్ స్టేటస్ వచ్చాకా.. విజయశాంతి యాక్షన్ మూవీస్, లేడి ఓరియెంటెడ్ కథలని ఎంచుకోవటం మొదలుపెట్టింది. ఇండియాలోనే తోలి లేడి సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగింది కూడా. స్టార్ హీరోలకి ధీటుగా ఫైట్స్, మార్కెట్ మార్కెట్ విజయశాంతికి వచ్చేసాయి. వీటితో పాటు ఆమెలో ఫైర్ బ్రాండ్ యాంగిల్ కూడా బయటికొచ్చింది. సినిమాల్లో విలన్స్ ని ఎలాగైతే ఎదురిస్తుందో.. రియల్ లైఫ్ లోను ఎంతటి వారినైనా దైర్యంగా విజయశాంతి విమర్శించగలదు అన్న పేరు వచ్చేసింది.

ఒకానొక సమయంలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో తన పాత్రని తక్కువ చేశారంటూ మెగాస్టార్ చిరంజీవితోను విజయశాంతి గొడవ పెట్టుకుందని టాక్. విజయశాంతికి బయపడి గ్యాంగ్ లీడర్ కథలో సపరేట్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా పెట్టారని అంటారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్ళటం.. ప్రత్యర్దులని విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేయటం విజయశాంతికి అలవాటైపోయింది. దాంతో అటు ఇండస్ట్రీలోనూ, రాజకీయాల్లోనూ విజయశాంతి అంటే చాలామందికి హడల్ అంటారు. మొన్న ఒక సినిమా ఫంక్షన్ లో మెగాస్టార్ సైతం ‘నన్ను అప్పుడు ఎందుకు తిట్టావ్ శాంతి.. నీకు నేను అంత కాని వాడిని అయిపోయనా’ అని వేదికపై బ్రతిమిలాడతాడు. అలాంటి మరో సన్నివేశం తాజాగా మళ్ళీ కనిపించింది.

అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన నందమూరి బాలకృష్ణ.. ఒక ఫన్నీ గేమ్ లో విజయశాంతి పేరు ఎత్తడానికి భయపడిపోయాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. గేమ్ లో భాగంగా అందరిముందు బాలయ్యని అల్లు శిరీష్ కొన్ని కొంటె ప్రశ్నలు అడిగాడు. మీరు పనిచేసిన హీరోయిన్స్ లో ఊర్వశి ఎవరు రాక్షసి ఎవరో చెప్పాలంటూ.. విజయశాంతి పేరుని మొదటగా ప్రస్తావించాడు. దాంతో ఉలిక్కిపడ్డ బాలయ్య మరిన్ని ఆప్షన్స్ కావాలని అడుగుతాడు. దాంతో సిమ్రాన్, నయనతార, శ్రుతిహాసన్, విజయశాంతిల పేర్లు చెప్తాడు అల్లుశిరీష్. అయితే బాలయ్య మాత్రం విజయశాంతి పేరు ఎత్తకుండా.. నయనతార ఊర్వశి, శృతి హాసన్ రాక్షసి అంటూ తప్పించుకుంటాడు. మరి మిగిలిన ఇద్దరు హీరోయిన్లు సార్ అని శిరీష్ మళ్ళీ అడిగినా .. ‘‘అయిపోయిందిగా. ఇద్దరినే అడిగావ్. ఇక తిలోత్తమా, రంభ అవన్నీ వేరు. నువ్వు వాళ్ల గురించి అడగలేదుగా’’ అంటూ బాలయ్య తప్పించుకున్నారు.