is balakrishna behind sharwanand marriage
mictv telugu

అన్ స్టాపబుల్ ఎఫెక్ట్.. శర్వానంద్ పెళ్లి వెనుక బాలయ్య..!

January 6, 2023

is balakrishna behind sharwanand marriage

తనదైన సెటిల్డ్ యాక్టింగ్ తో తెరపై ఎందరో అమ్మాయిల మనసుల్ని గెలుచుకున్న హీరో శర్వానంద్ తన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేయనున్నాడు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 26న శర్వా ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. శర్వానంద్ ది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం అంటున్నారు. అయితే శర్వాని పెళ్లాడనున్న అమ్మాయిది పూర్తిగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ అని తెలుస్తుంది. వధువు స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలు. బొజ్జల కుటుంబానికి టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. వధువు మేనమామ బొజ్జల సుధీర్ రెడ్డి కూడా కాళహస్తికి చెందిన టీడీపీ నేత. చాలా మంది సినీ ప్రముఖులతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. సుధీర్ రెడ్డి మేనకోడలే శర్వాకి కాబోయే భార్య అని తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో మరో క్రేజీ వార్త ఒకటి వైరల్ అవుతుంది. శర్వానంద్ పెళ్లి వెనుక బాలయ్య ఉన్నట్టు రూమర్స్ వస్తున్నాయి.

టీడీపీ పార్టీకి సన్నిహితులైన బొజ్జల కుటుంబంతో బాలకృష్ణకి మంచి అనుబంధం ఉందట. ఎప్పటి నుండి బొజ్జల సుధీర్ రెడ్డి తన మేన కోడలికి సంబంధాలు చూస్తున్న విషయం తెలుసుకుని.. స్వయంగా బాలయ్యే శర్వానంద్ ని సజెస్ట్ చేసాడని తెలుస్తుంది. మొన్న తన టాక్ షోకి గెస్టుగా వచ్చినప్పుడు కూడా పెళ్లిపై శర్వానంద్ కి ప్రశ్నలతో ఆడుకున్నాడు బాలయ్య. అయితే పెళ్లి టాపిక్ ఎత్తగానే ప్రభాస్ పేరు చెప్పి తప్పించుకున్నాడు శర్వానంద్. స్క్రీన్ పై డీసెంట్ క్యారెక్టర్స్ చేసే శర్వా రియల్ లైఫ్ లోను చాలా మెచ్యూర్డ్ పర్సన్ అంటారు. వివాదాలకు ఆమడ దూరంలో ఉంటాడు. ఇలా శర్వానంద్ క్యారెక్టర్ నచ్చే బాలయ్య ఈ పెళ్లి సెట్ చేశాడని వార్తలొస్తున్నాయి. అయితే ఈ కథనాల్లో నిజమెంతుందో కానీ శర్వా మాత్రం ఎట్టకేలకు 38సంవత్సరాల వయసులో పెళ్ళికి రెడీ అయిపోయాడు. తాజా గుసగుసల ప్రకారం.. కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ని కూడా ప్లాన్ చేస్తున్నారని ..వేసవిలో పెళ్లి జరుగుతుందని సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.