'టీ' తాగితే నష్టమా..? లాభామా? - MicTv.in - Telugu News
mictv telugu

‘టీ’ తాగితే నష్టమా..? లాభామా?

March 3, 2022

t07

టీ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘ఉదయం లేవగానే టీ. మధ్యాహ్నం అయితే టీ. తలనొప్పి స్టార్ట్ అయితే టీ. వర్క్ ఫ్రెజర్ ఎక్కువతే టీ’. కొంతమందికైతే టీ తాగకుంటే ఏం తోచదు. ఇలా రోజుకు దాదాపు 1 నుంచి 5 సార్లు టీ తాగుతుంటాము. అయితే కొంత మందిలో ఓ భయం ఉంటుంది. రోజుకు ఇన్నిసార్లు టీ తాగుతున్నాం కదా నష్టమా? లేక లాభామా?, టీ తాగడం మానేయాలా? దీని వల్ల సమస్యలు వస్తాయా? అలాంటప్పుడు ఏం చేయాలి? అనే ప్రశ్నలు పదేపదే వెంటాడుతుంటాయి. మరి ‘టీ’ తాగితే ఏం జరుగుతుందో తెలుసుకుందామా..

 

‘టీ’లో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల లావైపోతారు కూడా. అయితే కొన్ని ముఖ్యమైన టిప్స్ పాటించడంతో మీరు బరువు పెరగకుండా ఉండొచ్చు..

చాలా మంది టీని పెట్టుకునేటప్పుడు కొద్దిగా అల్లం లేదా ఇలాచి వాడుతూ ఉంటారు. నిజానికి ఇలా చేయడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. అలాగే ఆరోగ్యానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కనుక టీని పెట్టుకునేటప్పుడు కొంచెం తులసి, యాలుకలు, లవంగాలను కానీ వేసుకోండి. ఇలా చేయడం వల్ల దానిలో పోషక పదార్థాలు పెరుగుతాయి. అంతేకాకుండా మెటబాలిజంకి ఉపయోగపడుతుంది. బరువుని అదుపులో ఉంచడానికి కూడా ఇది సహాయ పడుతుంది. ముఖ్యంగా లవంగాలు కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.

బాగా లావై పోతున్నాము అని అనుకునే వాళ్లు..

క్యాలరీలను తగ్గించుకోవడానికి ఫ్యాట్ మిల్క్ కాకుండా చూసుకోండి. ఎక్కువ కొవ్వు ఉండే పాలని ఉపయోగించడం వల్ల లావైపోతారు. మీరు కావాలంటే ఓట్స్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ లేదా సోయా మిల్క్ వాడొచ్చు. అదే విధంగా క్రీమ్ ఉండే పాలకు దూరంగా ఉండటం మంచిది. ఇలా చేయడం వల్ల కూడా క్యాలరీలు తగ్గుతాయి. పైగా బరువు పెరిగి పోకుండా ఉండడానికి కూడా అవుతుంది.

టీ మానలేక పోతున్నారా..

టీలో చక్కెర శాతాన్ని తగ్గించండి. ఇలా చక్కెరను తగ్గించడం వల్ల కేలరీలు కూడా తగ్గుతాయి. కావాలి అనుకుంటే మీరు చక్కెరని తగ్గించి, అందులో బెల్లం కానీ తేనె కానీ వేసుకోండి. ఇలా చేయడం వల్ల తియ్యదనం వస్తుంది. అలాగే చక్కెర వల్ల కలిగే నష్టాల నుండి కూడా మీరు దూరంగా ఉండొచ్చు.